ఖమ్మం జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల

ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైన దృష్ట్యా ఈ సంవత్సరం నుండి తరగతుల ప్రారంభానికి భవనాల, సౌకర్యాలు గురించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.

 Approved Medical College For Khammam District , Library, Anatomy Lab, Physiology-TeluguStop.com

గౌతమ్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో కలెక్టర్ మెడికల్ కళాశాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కలెక్టరేట్ భవనాల సముదాయం, ఆర్ అండ్ బి కార్యాలయం వైద్య కళాశాల కు కేటాయించినట్లు ఆయన అన్నారు.ప్రస్తుతం మొదటి సంవత్సర తరగతుల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు.

ఉన్న భవనాల్లో ఎంత మేర ఉపయోగంలోకి తేవచ్చొ, ఎంతమేర క్రొత్త భవనాల ఏర్పాటు చేయాలో కార్యాచరణ చేయాలన్నారు.లైబ్రరీ, అనాటమి ల్యాబ్, ఫిజియోలజి, లెక్చర్ హాళ్లు, రిషిప్షన్ హాల్ తదితరాలకు ప్రస్తుతమున్న గదుల సవరణలు చేపట్టి ఉపయోగంలోకి తేవాలన్నారు.

ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఇ లక్ష్మణ్, ఇఇ శ్యామ్ ప్రసాద్, టీఎస్ఎంఐడిసి ఇఇ ఉమా మహేష్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube