మీకు ఇన్సూరెన్స్ పాలసీ వుందా? అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లో నో క్లెయిమ్ బోనస్ గురించి తెలుసా?

మనలో ఇళ్లల్లో ఇంచుమించుగా ఒక్కరికైనా హెల్త్ బీమా అనేది ఉంటుంది.అయితే అనేకమంది ఏమి తెలుసుకోకుండానే చాలా గుడ్డిగా ఈ బీమాలు తీసుకుంటారు.

 Know About No Claim Bonus In Health Insurance Details,  Insurance Policy, Helath-TeluguStop.com

అయితే ఇవి తీసుకునే ముందు అనేక విషయాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి.అలాంటి విషయాలలో “నో క్లెయిమ్ బోనస్” అనేది ముందు వరుసలో ఉంటుంది.

ఇపుడు ఈ నో క్లెయిమ్ బోనస్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

ఉదాహరణకు మనం తీసుకున్న బీమా 15 లక్షలు అనుకుందాం.

కానీ ఒక అయిదేళ్ల పాటు ఆ సొమ్ము మనం వాడుకోలేదు అంటే అది పెరుగుతుంది.అయిదేళ్లుగా ఎలాంటి క్లైమ్ లేకుండా నో క్లైమ్ బోనస్ పెరిగి 25 లక్షలు అవుతుంది.

ఆ సొమ్ము ఒక్కసారే వాడుకోవచ్చు.అదే ప్రీమియంతో.

ఏదో ఒకసారి చిన్న చిన్న అనారోగ్యానికి ఇరవై ముప్పై వేలు ఇన్సూరెన్స్ కింద క్లైమ్ చేయవచ్చు.కానీ నో క్లైమ్ బోనస్ కారణంగా చేయరు కొందరు.

నో క్లైమ్ బోనస్ బీమా ప్రపంచంలో ఒక ఉభయ తారక మంత్రం అంటారు నిపుణులు.నో క్లైమ్ బోనస్ వల్ల అదే ప్రీమియం కడుతూ రాను రాను ఎక్కువ కవరేజీ పొందే అవకాశం కల్పిస్తారు.

Telugu Care, Insurance, Bonus-Latest News - Telugu

ఇక ఆరోగ్యవంతులకు అనూహ్యంగా వచ్చే ఆరోగ్య సమస్యల సమయంలో ఆర్థికంగా ఇది ఎంతో లాభం.ఒకవేళ ఏ సమస్యా రాకపోయినా కట్టే ప్రీమియం తక్కువే కాబట్టి ఏ సమస్యా ఉండదు.ఇది బీమా సంస్థలకు కూడా లాభమే.చిన్న చిన్న అనారోగ్యాలకు అవసరానికి మించిన చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేస్తారు కొందరు.అలాంటి వాళ్ళతో బీమా కంపెనీలకు నష్టం ఎక్కువగా ఉంటుంది.వినియోగదారులు ఆరోగ్యంగా ఉంటూ, చిన్న అనారోగ్యానికి సైతం క్లైమ్ బాట పట్టకుండా ఉంటే ఫేక్ క్లైమ్ చెల్లింపులు చాలా తగ్గుతాయి.

అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకునే నో క్లైమ్ బోనస్ స్కీములను సెలెక్ట్ చేసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube