జీ సరిగమప-ది విన్నర్ గా శృతిక.. ఆమె కష్టాలు కన్నీళ్లు ఇవే!

తెలుగు ప్రేక్షకులకు జీ సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్స్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తాజాగా ఈ కార్యక్రమం ముగిసింది.

 Zee Saregamapa Singing Superstars Winner Shruthika Samudrala-TeluguStop.com

అయితే సుమారు 26 వారాలపాటు నాన్ స్టాప్ గా వినోదాన్ని అందించిన ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే లో అద్భుతమైన ప్రదేశములతో హైదరాబాద్ చెందిన శృత్రిక సముద్రాల టైటిల్ విజేతగా నిలవగా వెంకట సుదాన్షు రన్నరప్ గా నిలిచాడు.ఇక విజేత శృతిక గెలుచుకున్న బహుమతుల విషయానికి వస్తే.

జీ సరిగమప ది సింగింగ్ సూపర్‌ స్టార్స్‌ ట్రోఫీతో పాటుగా, శృతిక రూ.లక్ష నగదు, మారుతి సుజుకి వాగన్ ఆర్ కారుని కూడా బహుమతిగా అందుకుంది.

ఇక రన్నరప్‌గా నిలిచిన వెంకట సుధాన్షు రూ.5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు.ఇకపోతే విన్నర్ శృతిక విషయానికి వస్తే.సంవత్సరాల వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన శృతిక కర్నాటిక్ సంగీతంలో శిక్షణ తీసుకుంది.గెలిచిన సందర్భంగా శ్రుతికా మాట్లాడుతూ.జీ సరిగమప ది సింగింగ్ సూపర్‌ స్టార్స్‌ విన్నర్ గా నిలవడం ఒక డ్రీం కం ట్రూ మూమెంట్.

ఇది నా లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్, ఎప్పటికి మరిచిపోలేనిది.ఈ ట్రోఫీని నేను నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను.

నాతో పాటుగా, నా తోటి ఫైనలిస్ట్స్ కూడా అద్భుతంగా పాడారు.

Telugu Hyderabad, Zee Saregamapa, Zeesaregamapa-Movie

కాబట్టి వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నాను.ఈ సరిగమప జర్నీలో వారు నాకు ఎంతగానో సపోర్ట్ గా నిలిచారు.వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను.

అదేవిధంగా, ఈ జర్నీలో నాకు సహకరించిన జీ సరిగమప టీం, ముఖ్యంగా మెంటర్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్లకి నా ప్రత్యేక ధన్యవాదాలు.అలాగే, నేను సింగర్ గా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్న మా నాన్న శశికాంత్, అమ్మ రూప, అక్క శరణ్యకి, అలాగే సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీ రామాచారి కొమండూరి గారికి, శ్రీ నిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొచ్చింది శృతిక.

కాగా ఆగష్టు 14 న ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎపిసోడ్ ప్రసారం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube