సొర చేప ముందే నీటిలో పడిపోయిన తల్లీబిడ్డలు.. షాకింగ్ వీడియో వైరల్

అడవిలో సింహాలు, పులులు ఎంత క్రూరమైనవో, ప్రమాదకరమైనవో సముద్రంలో షార్క్స్ (Sharks) కూడా అంతే ప్రమాదకరమైనవి.ఈ సొరచేపలు మనుషులను పూర్తిగా మింగేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

 Mother And Child Who Fell Into The Water Before The Shark Video Viral Details, V-TeluguStop.com

అయితే వీటి జోలికి వెళితేనే ఇవి దాడి చేస్తాయి.అందుకే సముద్ర ప్రయాణాలు చేసేవారు వీటికి మరీ దగ్గరగా వెళ్లరు.

చేపలు పట్టేవారు వీటి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.ఎందుకంటే అవి ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలా దాడి చేస్తాయో ఊహించడం చాలాకష్టం.

అందుకే సముద్రాలపై వెళ్లేవారు సొర చేపలను చూస్తేనే ఆమడ దూరం పారిపోతున్నారు.అయితే తాజాగా ఒక తల్లి, కొడుకు కలిసి ఒక సొర చేపకు మాంసం ముక్క అందించాలనున్నారు.

అది కూడా చాలా సమీపం నుంచి కావడం గమనార్హం.

అయితే దురదృష్టం కొద్దీ వారు ఒకేసారి ఆ సొరచేప ఉన్న నీటిలో పడిపోయారు.

దాంతో తల్లి భయంతో చాలా వణికిపోయింది.ఇక ఆ కొడుకు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ తన కుమారుడితో కలిసి ఒక సముద్రం ఒడ్డున చెక్క పై ఉండటం గమనించవచ్చు.

ఆ తర్వాత ఈమె తన కొడుకు చేతితో ఒక షార్క్ కు మాంసం ముక్క అందించాలి అనుకుంది.షార్క్ ఆ మాంసం వాసనకు అక్కడికి వెంటనే వచ్చింది.

ఆ తర్వాత మాంసం ముక్కను అది నోట కరుచుకుంది.

అయితే ఆ సొర చేప పిల్లవాడికి మరింత దగ్గరగా రావడంతో తల్లి బాగా భయపడిపోయింది.ఈ క్రమంలోనే బ్యాలెన్స్ తప్పి ఆమె నీటిలోకి ఒరిగింది.పిల్లవాడిని సపోర్టుగా పట్టుకోవాలనుకుంది కానీ ఫలితం లేకుండా పోయింది.

దీంతో ఆ తల్లి బిడ్డ ఇద్దరు కూడా నీటిలో పడిపోయారు.అదికూడా సొరచేప ఉన్న నీటిలో! ఇది ఊహించని ఆ మహిళ ఒక్కసారిగా కంగు తిన్నది.

ఆ తర్వాత ఒడ్డుకు రావడానికి ప్రయత్నించింది.అదృష్టవశాత్తు ఆ సొరచేప వీరిపై దాడి చేయకుండా తన దారిన తాను వెళ్ళిపోయింది.

లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానుకోండి అని హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube