మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏ చట్ట ప్రకారం కాల్పులు జరిపారో చెప్పాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిలదీశారు.మంత్రికి ఏమైనా గన్ లైసెన్స్ ఉందా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం స్పందించి శ్రీనివాస్ గౌడ్ ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ప్రాణహాని ఉందంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించిందని, అలాంటి వ్యక్తి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర రబ్బర్ బుల్లెట్లు ఉంటే ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు.
తమకు భద్రతగా ఉన్న గన్ మెన్ల వద్ద ఉన్నవి రబ్బర్ బుల్లెట్లా లేక ఒరిజనల్ బుల్లెట్లా అనే ప్రశ్నకు డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ విషయంపై డీజీపీ నిజాయితీగా వ్యవహరించి తుపాకీని ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపాలన్నారు.
లేని పక్షంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.