హరికృష్ణ వల్ల ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో ప్రభాస్ నటించలేదా.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఏదనే ప్రశ్నకు స్టూడెంట్ నంబర్1 సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.అయితే ప్రభాస్ నటించాల్సిన ఈ సినిమాలో తారక్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంత్ం చేసుకున్నారు.

 Harikrishna Is Reason For Prabhas Missing Student Number One Movie Details Here-TeluguStop.com

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా స్టూడెంట్ నంబర్1 సినిమా నిర్మాత అశ్వనీదత్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.

సీతారామం సినిమాతో అశ్వనీదత్ కూతుళ్లు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

అశ్వనీదత్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ గారిని దైవంగా భావిస్తానని తెలిపారు.నా కూతుళ్లు నాకంటే ఎక్కువ పోగొడతారని నేను అనుకున్నానని అశ్వనీదత్ అన్నారు.అనిల్ కపూర్ తో చూడాలని ఉంది సినిమా రీమేక్ చేస్తే అల్లు అరవింద్ కు ఆరు కోట్ల రూపాయలు, నాకు ఆరు కోట్ల రూపాయలు పోయాయని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.

జాతిరత్నాలులో కథ చెప్పడానికి ఏమీ లేదని మాస్ సీన్స్ మాత్రమేనని అశ్వనీదత్ తెలిపారు.

స్టూడెంట్ నంబర్1 సినిమాకు తారక్ ను తీసుకోవాలా లేక ప్రభాస్ అయితే ఈ సినిమాకు బాగుంటుందేమోనని నాకు అనిపించిందని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో హరికృష్ణ ఫోన్ చేయడంతో తారక్ తో ఆ సినిమా తీశామని అశ్వనీదత్ తెలిపారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నాకు ఎప్పుడూ అనిపించలేదని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.

Telugu Harikrishna, Ntr, Prabhas, Ashwinidat, Seetharam, Sr Ntr, Number-Movie

జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్2 తీయాలని ఆలోచన ఉందని అశ్వనీదత్ పేర్కొన్నారు.థియేటర్లకు ఓటీటీ ఎంతమాత్రం ప్రమాదకరం కాదని అశ్వనీదత్ తెలిపారు.థియేటర్లు ప్రస్తుతం ముగ్గురు నలుగురి చేతుల్లోనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రాజెక్ట్ కే 55 శాతం షూటింగ్ పూర్తైందని ఆయన తెలిపారు.హరికృష్ణ వల్ల స్టూడెంట్ నంబర్1 సినిమాలో ప్రభాస్ ఒక విధంగా ఛాన్స్ మిస్ చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube