యాడ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న అల్లు అర్జున్.. ఈయన క్రేజ్ మామూలుగా లేదు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఈ సినిమాతో ఈయనకు నార్త్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.

 Icon Star Allu Arjun Earnings Through Ads Details, Allu Arjun,tollywood,pusha2,c-TeluguStop.com

ఈ విధంగా అల్లు అర్జున్ కు సౌత్ టు నార్త్ విపరీతమైన క్రేజ్ ఉండడంతో ప్రస్తుతం ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారు.పుష్ప సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో పాల్గొనబోతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీలకు కేవలం సినిమా అవకాశాలు మాత్రమే కాకుండా ఎన్నో రకాల బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం వస్తుంది.ఈ క్రమంలోనే ఎన్నో కంపెనీలు సౌత్ ఇండస్ట్రీలో ఒకరిచేత తమ బ్రాండ్ కు ప్రమోటర్ గా నియమించుకొని నార్త్ లో మరొకరిని నియమించుకునేవారు.

అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు నార్త్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉండడంతో అన్ని భాషలలోనూ ఈయన ప్రమోటర్ గా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొని పెద్ద ఎత్తున కంపెనీలు ఈయనకు అవకాశాలు కల్పిస్తున్నారు.

Telugu Allu Arjun, Astral, Coca Cola, Icon Allu Arjun, Pepsi, Pusha, Tollywood,

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజాగా కోకో-కోలా, ఆస్ట్రల్, కేఎఫ్‌సీ, రెడ్ బస్, జొమాటో యాడ్స్ చేశాడు.ఒక్కో ప్రకటనకు గాను రోజుకు సుమారు 7.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు.ఇలా అధిక మొత్తంలో యాడ్స్ ద్వారా రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు.ఈయన కేవలం యాడ్స్ ద్వారా మాత్రమే ఏడాదికి 100 కోట్లకు పైగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

ఏది ఏమైనా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ రావడమే కాకుండా ఎన్నో అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి.ఇకపోతే పుష్ప2 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube