మహేష్ బాబుకు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్ ఏంటో మీకు తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు రోజురోజుకు ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.మహేష్ బాబు తను నటించిన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారనే సంగతి తెలిసిందే.

 Star Hero Mahesh Babu Rare Record Details Here Goes Viral ,mahesh Babu ,mahesh B-TeluguStop.com

తాజాగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ నటించిన పోకిరి మూవీ రీ రిలీజ్ కావడంతో పాటు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.

మహేష్ బాబుకు క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయనే సంగతి తెలిసిందే.మహేష్ బాబు నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను ఓవర్సీస్ లో సొంతం చేసుకున్నాయి.

మహేష్ నటించిన నాలుగు సినిమాలు యూఎస్ లో 2 మిలియన్ గ్రాస్ కలెక్షన్లను అందుకోవడం గమనార్హం.

ఓవర్సీస్ లో మహేష్ కు మాత్రమే ఈ అరుదైన ఘనత సొంతం కావడంతో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మరో వారం రోజుల్లో మొదలుకానుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లాక్ కావడం గమనార్హం.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

Telugu Mahesh Babu, Maheshtrivikram, Pokiri, Pooja Hegde, Rare-Movie

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ ఫైనల్ కావాల్సి ఉంది.సమ్మర్ టార్గెట్ గా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.మహేష్ బాబు తర్వాత సినిమాలతో కూడా మంచి ఫలితాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube