తొలిచూపులోనే ఆ హీరోతో ప్రేమలో పడిన నటి కస్తూరి.. కట్ చేస్తే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హ్యాండ్సమ్ హీరోలు ఉన్నారు.ఈ క్రమంలోనే నిన్నటి తరం హీరోల విషయానికి వస్తే నవ మన్మధుడుగా పేరు సంపాదించుకున్న నటుడు నాగార్జున గురించి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈయనకు ఆరుపదుల వయసు వచ్చినప్పటికీ కూడా ఎంతో యంగ్ గా కనిపిస్తారు.

 Kasturi The Actress Who Fell In Love With The Hero At First Sight If Cut , Kastu-TeluguStop.com

ఇక నాగార్జున స్టైల్ కి ఎంతోమంది ఫిదా అయిన వాళ్లు ఉన్నారు.ఈయన ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోగా కొనసాగడమే కాకుండా అమ్మాయిలను ఒక చూపుతోనే ఆకర్షిస్తారని చెప్పాలి.

ఈ క్రమంలోనే నాగార్జున పై మనసు పారేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.అలాంటి వారిలో నటి టబు కూడా ఒకరనీ, ఒకప్పుడు ఈమె నాగార్జున పై మనసు పారేసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మరొక నటి కూడా నాగార్జున అంటే తనకెంతో ఇష్టమని తొలిచూపులోనే ఆయనతో ప్రేమలో పడ్డానని తెలియజేస్తున్నారు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి.ఈమె ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి సందడి చేశారు.

Telugu Actress Tabu, Iii Grhalakmi, Kasturi, Nagarjuna, Tollywood-Movie

తెలుగులో నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో నటించారు.అదేవిధంగా ఆకాశ వీధిలో అనే సినిమాలో కూడా నటించారు.ఇకపోతే మొదటిసారి ఆయనను కలిసినపుడు ఈమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారని, ఇలా సెకండ్ ఇవ్వడంతో ఆరోజు మొత్తం తన చేతిని ఇతరులకు ఇవ్వలేదని అలాగే తన చేయని కూడా కడగలేదని ఈమె ఒక సందర్భంలో తెలిపారు.ఈ విధంగా మొదటి సారి నాగార్జున గారిని చూసినప్పుడే తనపై మనసు పారేసుకున్నానని ఈమె తెలిపారు.

అయితే ఈ రెండు సినిమాల తర్వాత కస్తూరి పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.అయితే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube