టాప్ లెస్ ఫోటోతో షాకిచ్చిన నటి.. రణ్‌వీర్‌ సింగ్‌ ని ఫాలో అవుతూ?

బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి సార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రణ్‌వీర్ సింగ్.

 After Ranveer Singh Khatron Ke Khiladi 12 Fame Erika Packard Topless Photo, Ranv-TeluguStop.com

ఇకపోతే రణ్‌వీర్‌ సింగ్ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నగ్న ఫోటో షూట్ ఎంత దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే.

హీరో రణ్‌వీర్‌ సింగ్ సినిమాల ద్వారా కంటే ఈ నగ్న ఫోటో షూట్ ద్వారానే బాగా పాపులర్ అయ్యాడు అని చెప్పవచ్చు.ఈ ఫోటో షూట్ చేసిన తర్వాత రణ్‌వీర్‌ పేరు కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.

ఈ క్రమంలోనే రణ్‌వీర్‌ సింగ్ కు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు రణ్‌వీర్‌కు మద్దతు తెలిపారు.

కానీ సామాజిక, మహిళ సంఘాలు మాత్రం రణ్‌వీర్‌ సింగ్ నగ్న ఫోటోషూట్ పై అభ్యంతరం తెలిపారు.

రణ్‌వీర్‌ ఫొటోషూట్‌ మహిళల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ అతడి పై ముంబై కోర్టులో కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటికి ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.

ఇది ఇలా ఉంటే రణ్‌వీర్‌ సింగ్ మాదిరిగానే హీరో హీరోయిన్ లు నగ్న ఫోటో షూట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక నటి చేరింది.

నటి టాప్‌లెస్‌గా ఫొటోషూట్‌ చేసి సోషల్ మీడియాలో నిలిచింది.

ఆమె ఆ టాప్ లెస్ ఫోటో షేర్ చేస్తూ దానికి జత చేసిన క్యాప్షన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఆమె మరెవరో కాదు నటి ఎరికా ప్యాకర్డ్‌.ఈమె తాజాగా తన టాప్‌లెస్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఆ ఫోటోని షేర్ చేస్తూ దానికి రణ్‌వీర్‌ సింగ్‌కు కంపెనీ ఇస్తున్నా, కానీ మీరు నా బమ్స్‌ చూడలేరు అంటూ వివాస్పద క్యాప్షన్‌ ను జోడించింది.కాగా ఆమె బోల్డ్‌ ఫొటోషూట్‌ పై బాలీవుడ్‌ బుల్లితెర నటీనటులు, ఫాలోవర్స్‌ ప్రశంసలు కురిపిస్తూ ఎరికాకు మద్దతు తెలుపుతున్నారు.

కానీ పలువురు నెటిజన్స్ మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు.మరో వివాదానికి తెరలేపింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.మరి ఆ కామెంట్స్ పై ఎరికా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube