టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే.మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా పరిచయమైంది లక్ష్మి.
అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.లక్ష్మి తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.
హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇక ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది.ఇక ఆ మధ్య ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం లో కూడా హోస్టింగ్ చేసింది.
ఇక ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.పైగా బాగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.
వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెడుతుంది.ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.
అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.ఇటీవలే తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయగా అందులో తన హోమ్ టూర్ వీడియోలు కూడా చూయించింది.
అలా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరలో ఉంది.
అప్పుడప్పుడు వెండితెరపై జరిగే ఈవెంట్లలో కూడా పాల్గొంటుంది మంచు లక్ష్మి.ఇదంతా పక్కన పెడితే పోలీస్ గా ప్రదర్శనమిచ్చింది మంచు లక్ష్మి.దానికి సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.
ఇక ఆ ఫోటోను తన ఫ్రెండ్ ఎవరో స్టోరీ లా పెట్టడంతో ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి తను పంచుకుంటూ.థాంక్ యూ అని అది తన తమిళ్ మూవీ అని తెలిపింది.
ఇక ఆ ఫోటో చూసిన ఆమె అభిమానులు, నెటిజన్లు తెగ కాంప్లిమెంట్ లు ఇస్తున్నారు.అంతేకాకుండా ఈ పోలీస్ గెటప్ లో చాలా అందంగా ఉన్నారు అని ఈ సినిమా మీకు మంచి సక్సెస్ అందివ్వాలి అని కోరుకుంటున్నాము అని తెగ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు.
ఇక మరికొందరు వామ్మో అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి ఈ ఫోటో మాత్రం బాగా వైరల్ అవుతుంది.