తెలుగు ఎన్ ఆర్ ఐ డైలీ న్యూస్ రౌండప్

1.హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్న రష్యా ఉక్రెయిన్ జంట

  భారత్ లో ఉంటున్న రష్యా – ఉక్రెయిన్ లకు చెందిన జంట హిందూ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.రష్యా కు చెందిన సెర్గి నోవికొవ్, యుక్రెయిన్ కు చెందిన ఎలోనా ట్రమోకాలు సనాతన హిందూ ధర్మ ఆచారం ప్రకారం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల దివ్య ఆశ్రమంలో వివాహం చేసుకున్నారు.   

2.భారత లిఫ్టర్ కు గోల్డ్ మెడల్

 

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com

Telugu America, Canada, China, Gold Medal, India, Iran, Liz Truss, Monkeypox, Nr

కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల లిస్ట్ లో మరో గోల్డ్ మెడల్ వచ్చి చేరింది.పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ గోల్డ్ మెడల్ సాధించారు. 

3.మంకీ పాక్స్ ఎఫెక్ట్ : అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సి

 

Telugu America, Canada, China, Gold Medal, India, Iran, Liz Truss, Monkeypox, Nr

ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.అమెరికాలోనూ ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అమెరికా హెల్త్ ఎమర్జెన్సీ విధించింది.  4

.అమెరికాలో సిక్కు తలపాగాల జప్తు పై విచారణ

  మెక్సికన్ సరిహద్దుల వెంబడి నిర్బంధంలోకి తీసుకున్న దాదాపు 50 మంది సిక్కు వలసదారుల తల పాగాలను జప్తు చేసారన్న ఫిర్యాదు పై అమెరికా అధికారులు విచారణ ప్రారంభించారు. 

5.భారత్ తో చర్చలు జరిపేందుకు వచ్చిన చైనా

 

Telugu America, Canada, China, Gold Medal, India, Iran, Liz Truss, Monkeypox, Nr

లడక్ ప్రాంతంలోని భారత వైమానికి చెందిన సీనియర్ అధికారులు చైనాతో సైనిక  చర్చల్లో పాల్గొన్నారు.భారత్ గగన తలంలో ఎటువంటి అల్లర్లకు పాల్పడకుండా ఉండేందుకు అధికారులు చైనాతో చర్చలు సాగిస్తున్నారు. 

6.మహిళల హక్కుల విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం

 

Telugu America, Canada, China, Gold Medal, India, Iran, Liz Truss, Monkeypox, Nr

మహిళల విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడం పై నిషేధం విధించింది. 

7.కెనడాకు చైనా వార్నింగ్

  జి 7 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ప్రకటనల్లో కెనడా పాల్గొనడం పై చైనా మండిపడుతోంది.ఈ విషయమై కెనడా దౌత్యవేత్త జిమ్ నిఖిల్ ను పిలిపించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

8.టీవీ చర్చల్లో రిషి సునక్ ముందంజ

 

Telugu America, Canada, China, Gold Medal, India, Iran, Liz Truss, Monkeypox, Nr

బ్రిటన్ ప్రధాని ఎన్నిక కోసం జరుగుతున్న రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే వెనుకంజ లో ఉన్నట్టు సర్వేలు చెబుతున్న సమయంలో తాజా గా జరిగిన టీవీ డిబేట్ లో ట్రస్ పై రిషి సునక్ అనూహ్య విజయం సాధించారు. 

9.ట్విట్టర్ పై ఎలెన్ మస్క్ ఆరోపణ

  ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని మళ్లీ వెనక్కి తగ్గడమే కాకుండా ట్విట్టర్ పై అనేక ఆరోపణలు చేస్తూ వస్తోన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా ట్విట్టర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

వాస్తవాలను దాచి తనను మభ్యపెట్టి ట్విట్టర్ కొనుగోలుకు తనతో సంతకం చేయించారు అని ఎలెన్ మాస్క్ విమర్శించారు.భారత ప్రభుత్వంతో ట్విట్టర్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన వివాదాన్ని కూడా మస్క్ ప్రస్తావించారు.

         

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube