సీతారామం ఓటీటీలో వచ్చేది అప్పుడేనా?

డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం సీతారామం. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

 Dulquer Salman Sitaramam Movie Ott Release Update Details, Sitaram,tollywood,dir-TeluguStop.com

ఇలా థియేటర్లో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసిన ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించారు.ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్స్, క్యారెక్టరైజేషన్స్, స్క్రీన్ ప్లే అద్భుతం అంటూ కీర్తిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో గౌతమ్ మీనన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రష్మిక వంటి వాళ్లు కీలక పాత్రలలో నటించారు.

ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని మంచి హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి హిట్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.థియేటర్లో విడుదలైన ప్రతి ఒక్క సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరలకు ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సీతారామం సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Amazon Prime, Dulquer Salmaan, Sitaram, Sitaramam, Sitaramam Ott, Tollywo

ఈ విధంగా సీతారామం సినిమా హక్కులను అమెజాన్ భారీ ధరలకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రానుంది.ఇకపోతే ఈ సినిమా డిజిటల్ స్క్రీన్ పై ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కానుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్, ఆయన కుమార్తె స్వప్న సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube