పాపం.. రాజశేఖర్‌ కూతుర్లు బిజీ అవ్వలేరా?

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కు ఇద్దరు కుమార్తెలు అనే విషయం తెలిసిందే.వారిద్దరూ శివాని మరియు శివాత్మిక.

 Rajashekhar Daughters Shivani And Shivatmika Not Getting Offers Details, Shivani-TeluguStop.com

ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమ కు, ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

వీరిద్దరు కూడా మొదటి సినిమా తో నటిగా పర్వాలేదు అనిపించుకున్నారు.కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ లను దక్కించుకోలేక పోయారు.

ముఖ్యంగా చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని పాత్ర లో ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.అద్భుతం సినిమా లో పెద్దమ్మాయి శివాని మంచి నటనతో మెప్పించింది.

ఇక ప్రస్తుతం ఇద్దరు కూడా ఒక సినిమా చొప్పున చేస్తున్నారు, కానీ అవి పెద్దగా వీరికి స్టార్డం తెచ్చిపెట్టేది అనిపించడం లేదు.

తమిళంలో కొన్ని ఆఫర్లు వస్తున్నా కూడా మెయిన్ హీరోయిన్ గా మాత్రం వీరికి ఆఫర్లు రావడం లేదు.

కేవలం స్టార్ హీరో కూతురు అవ్వడం వల్ల వీరికి తెలుగు లో ఆఫర్లు రావడం లేదు అనేది ఒక ప్రచారం జరుగుతోంది.రాజశేఖర్ కూతురు అవ్వడం వల్ల చాలా మంది హీరోలు కూడా వారితో రొమాంటిక్ సన్నివేశాలను చేయడానికి ఇబ్బంది పడతారు, కనుక వారితో నటించడం కంటే మరొకరితో నటించడం ఉత్తమం అనే అభిప్రాయం లో కొందరు ఉన్నారట.

Telugu Jeevitha, Offers, Rajasekhar, Rajashekhar, Shivani, Shivatmika, Telugu-Mo

అంతే కాకుండా స్టార్ హీరో కూతుర్లు అవ్వడం వల్ల స్కిన్ షో కి వారు ఒకే చెప్పకపోవచ్చు అని అభిప్రాయం మొన్నటి వరకు వ్యక్తమైంది.కానీ సోషల్ మీడియా లో ఇద్దరు కూడా తాము స్కిన్‌ షో కు సిద్దమే అన్నట్లుగా హాట్ ఫోటో లను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.ముందు ముందు సినిమాల్లో ఆఫర్లు వస్తే ఎలాంటి సన్ని వేశాలకు కూడా సిద్ధమే అన్నట్లుగా వీరిద్దరు హింట్‌ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.జీవిత రాజశేఖర్ కూతురు అయిన వీరిద్దరూ ముందు ముందు అయినా టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా గుర్తింపు దక్కించుకుని బిజీ హీరోయిన్ లుగా మారుతారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube