రాజధానుల విషయంలో ఏపీ సర్కారుకు మరో టెన్షన్..

రాజధానుల విషయం లో సర్కారుకు మార్గదర్శకం చేయాలి.ఎందుకంటే ఓక ప్రాంతపు ప్రజల వైపే మొగ్గు చూపేలా ఓక రాజధానిని ఏర్పాటు చేస్తే అది ఇతర ప్రాంత ప్రజల యొక్క అసంతృప్తిని, అగ్రహజ్వాలలను చవి చూడవలసి వస్తుంది మన రాష్ట్ర సర్కారు.

 Another Tension For The Ap Government In The Matter Of Capitals , Tension For Th-TeluguStop.com

ముఖ్యం గా అటు న్యాయ సంబంధమైన విషయాలకు ,ఇటు పరిపాలనకు సంబందించిన వ్యవహారాలను నిర్వహించేందుకు తగిన సౌకర్యాలు అమరావతి లో లేవనేది జగమెరిగిన సత్యం.అదేవిధంగా చట్టసభల వరకు మాత్రమే అమరావతి ని రాజధానిగా చేయడం మూలాన అది అందరికి ఆమోదయోగ్యoగా ఉండటం తో పాటు తరచూ వచ్చిపోవడానికి ప్రజాప్రతినిధులకు అత్యంత సౌలభ్యంగా ఉంటుంది.

ఎందుకంటే ఆ ప్రాంతం అందరికి దగ్గర ప్రాంతం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.అంతేగాకుండా రాజధాని విషయం లో అటు విశాఖ వాసులు, ఇటు కర్నూలు ప్రాంత వాసులు వైస్.

జగన్మోహన్ రెడ్డి సారథ్యం లోని వైకాపా సర్కారు తమకు ఎంతో కొంత న్యాయం చేకూరుస్తుంది అన్న ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్న నేపథ్యం లో వారికి న్యాయం చేకూర్చాల్సిన కర్తవ్యం బాధ్యత ఈ రాష్ట్ర సర్కారుపై ఎంతైనా వుంది.

అంతేగాని ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు గోరంతలు కొండంతలు చేయవలసిన అవసరము లేదు.

అంతేగాకుండా ఇప్పటికే మూడు రాజధానులకు సంబందించిన బిల్లులపై గవర్నర్ ఆమోదముద్ర సైతం పడిన నేపథ్యం లో ప్రతిపక్షపార్టీలు ఈ అంశంపై అనవసర రాద్ధాంతానికి తెరలేపడం, గగ్గోలు పెట్టడం, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం ఏ మాత్రం సమంజసం కాదు.అయితే అమరావతి రాజధాని అవుతుందని ఎన్నో అసలు పెట్టుకొని అక్కడ భూమి విక్రయించిన వారికి,భూములు అమ్ముకున్న రైతులకు డబ్బులు వచ్చేలా వారికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మాత్రం ముమ్మాటికీ ఈ రాష్ట్రప్రభుత్వానిదే.

అయితే ఏ ఒక్కరికి అన్యాయం జరిగే వీలులేకుండా మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వ్యవహరించాలి.అవసరం అయితే న్యాయస్థానం వారు కూడా ఈ మూడు రాజధానుల విషయం ఫై శ్రద్ద పెట్టి, జోక్యం చేసుకొని ఈ రాష్ట్రప్రజానీకానికి యావత్తుకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకొనేలా ఈ రాష్ట్ర సర్కారుకు సరిఅయిన, స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకం వహించాల్సిన ఆవశ్యకత గౌరవనీయులైన న్యాయ కోవిదులపై ఎంతైనా వుంది.

Telugu Ap, Cm Jagan, Governor, Matter, Supreme-Political

ఏదిఏమైనా సుప్రీమ్ కోర్టు వారు ఈ రాజధాని విషయం లో వీలయినంత త్వరగా ఏదో ఓక నిర్ణయం తీసుకునేలా మన రాష్ట్రప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి వీటి సమస్యల పరిష్కారానికి సత్వరమే నడుం బిగించాలి.లేకపోతే పరిస్థితులు రాను రాను మరింత జటిలంగా మారి ఈ రాజధాని విషయంలో ఎటు నిర్ణయం తీసుకోలేని గందరగోళ పరిస్థితుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెట్టివేయబడుతుంది.ఏమైనా ప్రతి పక్ష పార్టీలు తమ స్వార్థాన్ని కాస్త ప్రక్కకు పెట్టి ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఓక రాజీ ధోరణిని అవలంబిస్తే అది ఈ మూడు రాజధానుల కథ కాస్తంత త్వరంగా సుఖాంతం కావడానికి మార్గం సుగమం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube