సీతారామం రివ్యూ: అద్భుతమైన లవ్ స్టోరీకి ఫుల్ మర్క్స్!

డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.దుల్క‌ర్ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది.

 Dulquer Salman Mrunal Thakur Rashmika Sitaramam Moview Review And Rating Details-TeluguStop.com

అనాథ అయిన రామ్ కు సీతామహాలక్ష్మీకి మధ్య ఉన్న ప్రేమ.వారి మధ్య ప్రేమ లేఖలు.20 ఏళ్ళ తర్వాత ఆ లేఖను అందించేందుకు రష్మిక ఎందుకు వస్తుంది అన్నదే సినిమా.అశ్వని దత్, స్వప్న సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో దుల్క‌ర్ సల్మాన్‌ అనాథ.

ఆయనకు సైన్యం.దేశం తప్ప మరేమి తెలీదు.

అలాంటి అమాయకుడైన రామ్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఉత్తరాలు వస్తాయ్.తిరిగి ఉత్తరం పంపిద్దాం అంటే చిరునామా ఉండదు.

దీంతో అక్కడ నుంచి వచ్చే ఉత్తరం కోసం రామ్ వెయిట్ చేస్తూ ఉంటాడు.ఒక రోజు ఉత్తరం రాసిన సీతామహాలక్ష్మీని కలుస్తాడు.

వారిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడుతుంది.ఇక అప్పుడే సీతామహాలక్ష్మీని పెళ్లి చేసుకుంటావా అని రామ్ అడిగితే ఆమె నుంచి సమాధానం రాదు.

అంత స్వచ్ఛమైన ప్రేమలో ఉన్న వారు ఎందుకు విడిపోయారు.రామ్ రాసిన ఉత్తరాన్ని 20 ఏళ్ళ తర్వాత సీతామహాలక్ష్మీకి ఇచ్చేనందుకు రష్మిక పాత్ర అఫ్రిన్ ఎందుకు వస్తుంది.

సీతామహాలక్ష్మీకి ఆ ఉత్తరాన్ని ఇస్తుందా లేదా అన్నదే కథ.

Telugu Dulkar Salman, Mrunal Thakur, Sita Ramam, Sitaramam, Sitaramam Story, Tol

నటినటుల నటన:

ఇక నటీనటుల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో ఒదిగిపోయాడు.మృణాల్ కూడా ఆమె పాత్రలో జీవించేసింది.స్వార్థం అంటే ఇలా ఉంటుందని రష్మిక మందన్నా తన పాత్రతో ప్రేక్షకులకు చూపించేసింది.సుమంత్ స్పెషల్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.హను రాఘవపూడి దర్శకత్వంలో తన మార్క్ చూపించాడు.ఈ సినిమాలో రామ్ పాత్రకు దుల్కర్ సల్మాన్ ప్లేస్ పాయింట్.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది.

Telugu Dulkar Salman, Mrunal Thakur, Sita Ramam, Sitaramam, Sitaramam Story, Tol

విశ్లేషణ:

ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ నటనలో మరో మెట్టు ఎక్కడనే చెప్పాలి.ప్రేమ గొప్పతనాన్ని హను రాఘవపూడి ఎంతో గొప్పగా చూపించాడు.సినీ ప్రియులకు ఈ వారం ఫీస్ట్ అనే చెప్పాలి.థియేటర్ లో చూడాల్సిన సినిమా.

ప్లస్ పాయింట్స్:

దుల్కర్ సల్మాన్, మృణాల్ నటన, నేపథ్య సంగీతం, అదిరిపోయిన ప్రేమకథ, అద్భుతమైన క్లైమాక్స్.

Telugu Dulkar Salman, Mrunal Thakur, Sita Ramam, Sitaramam, Sitaramam Story, Tol

మైనస్ పాయింట్స్:

రష్మిక పాత్రలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది.కొన్ని కొన్ని సీన్ల దగ్గర క్లారిటీ మిస్ అయ్యింది.

బాటమ్ లైన్:

ఇక చివరిగా.మీ ప్రియమైన వారితో థియేటర్ లో కచ్చితంగా చూడాల్సిన గొప్ప సినిమా సీతారామం.థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆ ప్రేమ కథ మీ మైండ్ లో నుంచి పోదు.అంత గొప్ప కథ సీతారామం.

రేటింగ్: 3/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube