బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన రియాల్టీ టాక్ షోలలో ఈ షో కూడా ఒకటి.
కాగా ఈ షోకీ కేవలం బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరవుతూ ఉంటారు.ఈ షో కి హాజరైన సెలబ్రిటీలతో హోస్ట్ కరణ్ జోహార్ చిట్ చాట్ నిర్వహిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఆయా సెలబ్రిటీలకు సంబంధించిన అనేక రహస్యాలను వ్యక్తిగత విషయాలను బయటకు రాబడుతూ ఉంటాడు.ఆ సెలబ్రిటీలకు సంబంధించిన సీక్రెట్,లవ్, బ్రేకప్, ఎఫైర్స్ ఇలా అన్ని విషయాలను ఓపెన్ గా అడుగుతూ వారి నుంచి నిజా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
అందువల్లే ఈ షో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ పొందింది.అభిమానుల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను ఇందులో చర్చించుకుంటూ,అడుగుతూ ఉండడంతో అభిమానులు కూడా ఈ షో పై మరింత ఆసక్తిని చూపిస్తున్నారు.
కాగా ఇప్పటికే బాలీవుడ్ నుంచి కొందరు టాలీవుడ్ నుంచి కొందరు సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు చేసిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే హోస్ట్ కరణ్ జోహార్ వారిని ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఈ నేపథ్యంలోనే కరీనా కపూర్ ని అడుగుతూ పిల్లలు పుట్టాక క్వాలిటీ సెక్స్ ఉంటుందా? అని ప్రశ్నించాడు.ఆ ప్రశ్న పై స్పందించిన కరీనా కపూర్ మీకు తెలియదా అంటూ సమాధానం ఇచ్చింది.ఇక వెంటనే కరణ్ జోహార్ ఈ షో మా అమ్మ చూస్తుంది నా సెక్స్ లైఫ్ గురించి మాట్లాడితే బాగుండదేమో అని అంటాడు.ఆ మాటకు వెంటనే స్పందించిన అమీర్ ఖాన్ మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడితే మీ మదర్ ఏం పట్టించుకోరు అని అంటాడు.
ఈ షోలో భాగంగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.