గోవిందా గోవిందా.. శుభలగ్నం.. సినిమాలకు ఉన్న ఈ లింకు గురించి తెలుసా?

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పేరు తీయగానే ఆయనకు సంబంధించిన వివాదాలు.సోషల్ మీడియాలో చేసిన సంచలన పోస్టులు మాత్రమే అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి.

 Relation Between Govinda Govinda And Shubalagnam,govinda Govinda,shubalagnam,ash-TeluguStop.com

ఒకప్పుడు రాంగోపాల్ వర్మ అంటే ప్రతి హీరోకు కూడా ఫేవరెట్.వర్మతో సినిమా తీస్తే సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు.

వర్మతో సినిమా ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చి పెడుతుందని అనుకునేవారు.టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటి తిరుగులేదు అని నిరూపించుకున్నారు.

ఇక అప్పట్లో ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇలాంటి రాంగోపాల్ వర్మ తో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కూడా ఓ సినిమా చేయాలని ఆశపడ్డాడు.
ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్లో గోవింద గోవింద అనే సినిమా వచ్చింది.ఇక నాగార్జున శ్రీదేవి కాంబినేషన్ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు.అప్పటికే వర్మ శివ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు.వర్మ పై నమ్మకంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా అశ్వినీదత్ గట్టిగానే ఖర్చు పెట్టాడు.

కానీ అనుకోకుండా ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.ఇంకేముంది ప్రొడ్యూసర్ అంచనాలు తారుమారు అయ్యి చివరికి నష్టాలే మిగిలాయి.

ఇలాంటి నష్టాల్లో ఉన్న అశ్వినీ దత్ ను ఒక చిన్న సినిమా గట్టెక్కించింది.


Telugu Ashwini Dutt, Bollywood, Govinda Govinda, Nagarjuna, Shubalagnam, Sridevi

అదే శుభలగ్నం. 1994 జనవరి 31న థియేటర్లో విడుదలైంది గోవింద గోవింద.అదే ఏడాది సెప్టెంబర్ 30న శుభలగ్నం రిలీజ్ అయ్యింది.

ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చింది.ఈ చిన్న సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

దీని కోసం ఖర్చు పెట్టింది కూడా చాలా తక్కువే అని చెప్పాలి.గోవిందా గోవిందా అనే సినిమాతో నష్టాల్లో కుదేలై సతమతమైన అశ్వినీదత్ కు శుభలగ్నం సినిమా ఒక మంచి బూస్ట్ ఇచ్చి లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక అప్పటినుంచి అశ్వినీదత్ కథల ఎంపికలో మరింత ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టారు.అయితే శుభలగ్నం సినిమా కి అశ్వినీదత్ ఖర్చుపెట్టిన దానికంటే అటు గోవింద గోవింద సినిమా కి పది రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు అని చెప్పాలి.

కానీ అది డిజాస్టర్ అయితే శుభలగ్నం మాత్రం సూపర్ హిట్ అయ్యి పది రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube