ఆ వైసీపీ ఎంపీ కోసం జనసేన టీడీపీ పోటా పోటీ ?

రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపిలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తాయా లేదా అనే విషయంలో స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో ఎవరికివారు సొంతంగా బలం పెంచుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.పొత్తు వ్యవహారం ఎన్నికల సమయంలో తేల్చుకోవచ్చు అనే లెక్కల్లో రెండు పార్టీల అధినేతలు ఉన్నారు.

 Ycp Mp Raghurama Krishnam Raju To Join Janasena Or Tdp,raghuram Krishnam Raju,td-TeluguStop.com

ఆ అభిప్రాయంతోనే విడివిడిగా బలం పెంచుకునేందుకు జనాల బాట పట్టారు.నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లో తిరుగుతూ,  వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,  ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు.

అయితే ఈ రెండు పార్టీల అధినేతలు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో సానుకూలంగా ఉంటూ,  ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు .తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు పాలకొల్లు నియోజకవర్గం లో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చారు.ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు అంశాన్ని ప్రస్తావించారు.రఘురాం కృష్ణంరాజుకు మద్దతుగా తాము ఉన్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.అంతకుముందు కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రఘురామ వ్యవహారాన్ని ప్రస్తావించారు.

 ప్రధాని నరేంద్ర మోది భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేపట్టిన ఆ సభకు తాను హాజరు కాకపోవడానికి కారణాలను పవన్ వివరించారు.

స్థానిక ఎంపీ రఘురామ కి ఆహ్వానం లేకపోవడం తోనే తాను భీమవరంలో జరిగిన ప్రధాని సభకు హాజరు కాలేదంటూ పవన్ చెబుతూ, రఘురామ  కృష్ణంరాజును హైలెట్ చేసేందుకు ప్రయత్నించారు.దీనిపై పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ, పవన్ ధైర్యవంతుడని రఘురామ వీడియో సందేశం వినిపించారు  ఈ రెండు పార్టీల అధినేతలు రఘురామకృష్ణంరాజును హైలెట్ చేస్తూ ఆయనను పొగిడేందుకు ప్రయత్నించడం  వెనక కారణాలు చాలా ఉన్నాయి.

గోదావరి జిల్లాలో క్షత్రి సామాజిక వర్గం బలంగా ఉండడం,  2019 ఎన్నికల్లో వైసిపి కి మద్దతుగా ఆ సామాజిక వర్గం పని చేసింది.ఎప్పుడైతే రఘురామ కృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారో, ఎప్పుడైతే రఘురాం కృష్ణంరాజును వైసిపి టార్గెట్ చేసుకుంటూ అరెస్ట్ చేయడం ,వేధింపులకు దిగడం వంటివి చోటు చేసుకున్నాయో అప్పటి నుంచి ఆ సామాజిక వర్గంలో చీలిక వచ్చిందని,  మెజారిటీ క్షత్రి సామాజిక వర్గం వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిడిపి జనసేన పార్టీలు అంచనా వేస్తున్నాయి.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Politics

 అందుకే ఈ సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా కనిపిస్తున్నాయి.అలాగే ఎన్నికల సమయం  నాటికి రఘురామ తమ పార్టీలో చేరుతారనే నమ్మకంతో అటు టిడిపి,  ఇటు జనసేన పార్టీలు ఉన్నాయి.రఘురామ కనుక తమ పార్టీలో చేరితే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో తమకు కలిసి వస్తుందని, ఆర్థికంగానూ రఘునామ బలవంతుడు కావడంతో తమ తమ పార్టీలకు మేలు జరుగుతుందనే లెక్కల్లో రెండు పార్టీల అధినేతలు ఈ స్థాయిలో రఘురామ జపం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube