రష్యా అమ్ముల పొదిలో మరో రక్షణ కవచం.శత్రువులకు కలలోకూడా గుబులు పుట్టిచేంత మరో శక్తివంతమైన ఆయుధం.
ఇప్పటికే రష్యా అంటే పవర్ ఫుల్ దేశాల్లో ఒకటి అనేది బ్రాండెడ్ గా గుర్తింపు పొందింది.అణ్వాయుధాలు, క్షిపణులు, తదితర మారణ హోమాలు సృష్టించ గలిగే అగ్రదేశాల్లో రష్యా కూడా ఒకటని అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఉక్రైన్ కు దడపుస్తున్న రష్యాన్ యుద్ధం తీరు, ప్రపంచ దేశాల కంటికి కునుకే లేకుండా చేస్తుంది.ఉక్రైన్ లో అది సాగిస్తున్న విధ్యంసం, కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి.
మరోవైపు ప్రపంచ నాటో దేశాలన్నీ రష్యాపై ఆర్ధిక అంక్షలను అమలు చేస్తూనే ఉన్నాయి.మరోవైపు రష్యా మిత్ర దేశం భారత్ మాత్రం ఎటూ చెప్పలేక న్యూటల్ గా ఉండిపోయింది.
అయినా డోంట్ కేర్.అంటూ న్యూట్రల్ గా ఉన్న భారత్ అండ చూసుకుని రష్యా ఇలా చెలరేగిపోతుందనే అనుమానలు ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఓ వైపు ఉక్రైన్ పై రష్యా సాగిస్తున్న అరాచకాలను ఖండిచలేక, అలాగని సమర్ధించనూ లేక సతమతమవుతున్న భారత్, ఆచి తూచి అడుగులు వేస్తుంది.కొన్ని దశాబ్దాలుగా భారత్, రష్యా అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని, యుద్ధం ఆపాలని మాత్రమే సలహా ఇచ్చింది.
ప్రస్తుత పరీస్థితులు ఎలా ఉన్నా., దేశ రక్షణ కోసం అధ్యక్షుడు పుతిన్ మరో అడుగు ముందుకు వేసారు.
అత్యంత శక్తి వంతమైన సబ్ మిరైన్, .అంతే అత్యంత కట్టుదిట్టంగా తయారు చేసి, నావికాదళంలో ప్రవేశ పెట్టింది.దీనిపేరే ‘కే-329 బెల్గొరోడ్’.
అత్యంత బరువైన, అత్యంత పొవడైన సబ్ మిరైన్ ఇది. ‘కే-329 బెల్గొరోడ్’గా పిలవబడుతున్న ఈ జలంతార్జామి.అణ్వాయుధాలతో కూడిన అండర్ వాటర్ డ్రోన్లను వేల మైళ్ల దూరం మోసుకెళ్లగలిగే సత్తా దీనికి ఉంది.
ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రపంచంలో అత్యంత బరువైన, పొడవైన సబ్ మిరైన్ ఇదే.ఈ జలాంతర్జామిలో మొత్తం ఆరు సొసైయిడన్ న్యూక్లియర్ ఆర్మ్ డ్ టోర్పెడోలు ఉన్నాయి.శత్రు దేశా తీరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సబ్ మెరైన్ నుంచి ఒక్క టొర్పెడో ను ప్రయోగిస్తే, శత్రు దేశ తీరమంతా రేడియోధార్మికతతో నిండిపోతుంది.దీంతో నాగసాకీ, హీరోషిమా లాంటి భయంకర మారణహోం జరిగిపోతుంది.
ఈ రేడియో ధార్మికత సోకినంత దూరం చుట్టుపక్కల చిన్న మొక్క కూడా మొలవదనేది రష్యన్ నిపుణుల వివరణ.
ప్రస్తుతం రష్యా ఈ జలాంతర్గములవైపే ప్రధానంగా దృష్టి సారించిందనేది విశ్వాసనీయ వర్గాల సమాచారం.2027 నాటికి ఇలాంటి జలాంతర్గాములను మరో రెండింటిని ప్రవేశ పెట్టాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసారు.ప్రస్తుతం ఉక్రైన్ తో జరుగుతున్న యుద్దంలో ఈ సబ్ మెరైన్ ను బూచిగా చూపించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకుల అంచనా.
ఒక వేళ అదే జరిగితే.ఉక్రైన్ ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుందనడంలో సందేహంలేదు.
మరోవైపు ఇప్పటికే అణ్వాయుధాల ముంగిట్లో గజగజా వణికిపోతున్న ప్రపంచ దేశాలు.రష్యా తలపెట్టిన ఈ లాంటి సబ్ మెరెన్లు మరిన్ని నావికాదళంలో చేరితో పరిస్థితి అగమ్మ గోచరమే.
మరిఇతర దేశాలు కూడా ఈ తరహా సబ్ మిరైన్లను తయారు చేయడానికి ఎందుకు యత్నించవు అనేది పలువురి వాదన?
.