లిథియం-అయాన్ సెల్‌ను ఆవిష్కరించిన ఓలా ఎలక్ట్రిక్... దీని విశేషాలివే..!

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా తొలి స్వదేశీ లిథియం-అయాన్ సెల్‌ను ఆవిష్కరించింది.ఈ సందర్భంగా దేశంలో మొట్టమొదటిగా తయారు చేసిన ఈ లిథియం అయాన్ బ్యాటరీ సెల్‌ గురించి చాలా విశేషాలు పంచుకుంది.

 Ola Electric Unveils Lithium Ion Battery Cell And Here Are Its Features Details,-TeluguStop.com

దీని సహాయంతో చాలా తక్కువ స్థలంలోనే ఎక్కువ ఎనర్జీ అందించడం సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది.కొత్తగా తయారు చేసిన ఈ రకం బ్యాటరీ సెల్‌కి ఎన్ఎంసీ2170 అని నామకరణం చేసినట్టు వెల్లడించింది.

వచ్చే ఏడాది నుంచి తమ తమిళనాడు ఫ్యాక్టరీలో వీటిని భారీ సంఖ్యలో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది.

లిథియం-అయాన్ బ్యాటరీ సెల్‌ తక్కువ స్పేస్‌లో ఎక్కువ ఎనర్జీ అందించడంతో పాటు ఎక్కువ కాలం మన్నుతుందని కంపెనీ పేర్కొంది.

మన దేశ వాతావరణం, పరిస్థితులకు అనుగుణంగా ఈ లిథియం-అయాన్‌లోని సెల్‌ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్‌లో 40 శాతం బ్యాటరీలదే ఉండగా మిగతా భాగాలకు 60 శాతం మాత్రమే ఖర్చవుతుంది.

Telugu Cell, Li Cell, Lithium, Lithiumbattery, Ups, Ola Electric, Ola India-Late

తయారీ ఖర్చులో ప్రధాన వాటా ఒక్క బ్యాటరీదే కాబట్టి వీటిలోని సెల్స్ స్థానికంగా తయారు చేసుకుంటే చాలా వరకు వాహనాల ఖర్చులను తగ్గించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.ప్రస్తుతం ఈవీ కంపెనీలు బ్యాటరీలలో వాడే సెల్స్‌ను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాయి.అయితే మొదటిసారిగా భారతీయ కంపెనీ ఓలా ఈ సెల్‌ను అభివృద్ధి చేయడంతో ఇతర కంపెనీల దీనిపై కన్నేసాయి.ఇదిలా ఉండగా ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్‌ సెల్ రీసెర్చ్ సెంటర్‌ను కూడా తాము స్థాపిస్తామని ఓలా కంపెనీ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube