టీడీపీకి బీజేపీ నేతలు థ్యాంక్స్ కూడా చెప్పలేకపోతున్నారా?

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏపీలో రెండు కీలక పార్టీల మద్దతును బీజేపీ కూడగట్టింది.అధికార వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి.

 Are Bjp Leaders Unable To Thanks To Tdp Details, Andhra Pradesh, President Elec-TeluguStop.com

మంగళవారం నాడు ఏపీలో పర్యటించిన ద్రౌపది ముర్ము వైసీపీ, టీడీపీ నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తమకు మద్దతు ప్రకటించిన వైసీపీకి బీజేపీ అగ్రనాయకులతో పాటు రాష్ట్ర నాయకులు అభినందనలు తెలిపినా టీడీపీకి మాత్రం చెప్పడానికి వాళ్లకు నోళ్లు రావడం లేదు.

మర్యాదకైనా ఆ పార్టీ పెద్దల నుంచి థ్యాంక్స్ అన్న మాట రాలేదనే విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏపీ రాజకీయాలలో వైసీపీ కచ్చితమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తోందని.

దానికి ఢిల్లీ బీజేపీ పెద్దల సహకారం ఉందని టాక్ నడుస్తోంది.ఈ విషయం గ్రహించే చంద్రబాబు కూడా ముర్ముకు మద్దతు ప్రకటించి తాను కూడా మీ వైపే ఉన్నానని బీజేపీ పెద్దలకు చెప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడిందని పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే ఇటీవల ఏపీ రాజకీయాలను గమనిస్తే కేంద్రంలో జగన్ పట్ల బీజేపీ సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

Telugu Andhra Pradesh, Chandrababu, Cmjagan, Draupadi Murmu, Prime Modi, Telugu

మోదీ, కేంద్రమంత్రులు అడగ్గానే జగన్‌కు అపాయింట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు.అంతేకాదు రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ సర్కారుపై విమర్శలు చేయకుండా చర్యలు కూడా తీసుకుంటున్నారు.దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా రఘురామకృష్ణంరాజు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

నర్సాపురం ఎంపీ రఘురామ బీజేపీ నేతలతో సఖ్యతగానే ఉన్నా ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమానికి ఆయన్ను బీజేపీ అధిష్టానం దూరంపెట్టింది.

Telugu Andhra Pradesh, Chandrababu, Cmjagan, Draupadi Murmu, Prime Modi, Telugu

రఘురామను దూరం పెట్టిన వ్యవహారం వెనుక జగన్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జగన్ తలుచుకోవడం వల్లే భీమవరం దరిదాపుల్లోకి కూడా రఘురామ రాలేకపోయారు.ఏకంగా పీఎంవో లిస్టులోనే స్థానిక ఎంపీ పేరు లేకుండా చేశారంటే తెరవెనుక తతంగం ఎంత జరిగిందో చర్చించాల్సిన పని లేదు.

రఘురామనే కాదు ఇతర నేతల నోటికి కూడా బీజేపీ తాళం వేస్తోందిజ మొత్తానికి తమను వ్యతిరేకించిన వారి గొంతులను నొక్కడానికి బీజేపీ హైకమాండ్‌ను వైసీపీ బాగానే వాడుకుంటోంది.గత ప్రభుత్వ హయాంలో టీడీపీ మాత్రం బీజేపీ హైకమాండ్‌ను వాడుకోలేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube