ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వైఎస్ జగన్ ప్రత్యేకంగా విద్యపై దృష్టి పెట్టడం జరిగింది.ఈ క్రమంలో రాష్ట్రంలో విద్య ఏ కుటుంబానికి దూరం కాకూడదని.

 Another Important Decision Of Ap Education Department Ap Cm Ys Jagan, Ap Educati-TeluguStop.com

ఆర్థికంగా ఇంకా అన్ని రకాలుగా రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులకు అనేక వసతులు జగన్ ప్రభుత్వం కల్పిస్తుంది.గవర్నమెంట్ బడులను “నాడు నేడు” ద్వారా రూపురేఖలను మార్చడం మాత్రమే కాదు ఇంగ్లీష్ మీడియం కూడా చేయడం జరిగింది.

జగనన్న గోరుముద్దపథకం ద్వారా.పాఠశాల పిల్లలకు పోషకాహారం అందిస్తూ ఉన్నారు.ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.రాష్ట్రంలో 292 ఉన్నత పాఠశాలలను ‘హై స్కూల్ ప్లస్‘ గా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఈ హై స్కూల్ ప్లస్ పాఠశాలలనీ ప్రత్యేకంగా బాలికలకు కేటాయించినట్లు ఆదేశాలలో స్పష్టం చేశారు.ఈ హై స్కూల్ ప్లస్ పాఠశాలలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ లలో స్థానికంగా ఉండే డిమాండ్ బట్టి… రెండు కోర్సులను మాత్రమే అందిస్తారు.

ఈ క్రమంలో వీటి కోసం పనిచేయడానికి 1752 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube