తమిళ హీరో శివ కార్తికేయన్ తన సినిమాలతో అటు తమిళ ఆడియెన్స్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ ని కూడా అలరిస్తున్నాడు.శివ కార్తికేయన్ లాస్ట్ టూ మూవీస్ వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ సినిమాలు రెండు తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి.
తెలుగులో తన సినిమాలకు వస్తున్న ఫలితాల ప్రోత్సాహంతో తన నెక్స్ట్ సినిమా తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ చేశాడు శివ కార్తికేయన్.జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి డైరక్షన్ లో వస్తున్న ప్రిన్స్ సినిమాతో డైరెక్ట్ గా తెలుగు ఆడియెన్స్ ముందుకొస్తున్నారు శివ కార్తికేయన్.
ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది.ఆ సినిమాకు ఇప్పుడు డైరక్టర్ కన్ఫర్మ్ అయ్యాడు.సోగ్గాడే చిన్ని నాయన టూ బంగార్రాజు సినిమాలతో అలరించిన కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో శివ కార్తికేయన్ నెక్స్ట్ తెలుగు సినిమా ఉంటుందని తెలుస్తుంది.బంగార్రాజు హిట్ కొట్టగానే కె.యి జ్ఞానవెల్ రాజా అతన్ని కలిశాడు.అప్పుడే ఆ కాంబో సినిమా ఫిక్స్ అయ్యింది.
జ్ఞానవెల్ రాజా నిర్మాతగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో శివ కార్తికేయన్ తెలుగు, తమిల బైలింగ్వల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.జాతిరత్నాలు అనుదీప్ శివ కార్తికేయన్ కాంబో ప్రిన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని అంటున్నారు.
చూస్తుంటే రజినీకాంత్, కమల్, విక్రం, సూర్య, కార్తి తరహాలో శివ కార్తికేయన్ కూడా తెలుగు మార్కెట్ పై పట్టు సాధించాలని చూస్తున్నట్టు ఉన్నాడు.ఎంటర్టైనింగ్ సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తున్న శివ కార్తికేయన్ తెలుగులో కూడా మంచి క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది.