తమన్నా సొంతం చేసుకున్న 5 ఖరీదైన వస్తువులు ఏంటో తెలుసా ?

మిల్కీ బ్యూటీ తమన్నా. దశాబ్దానికి పైగా హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికి వన్నెతరగని అందంతో కుర్ర కారు మతులు పోగొడుతుంది.

 Do You Know 5 Luxury Items Thamanna Owns Details, Tamanna, Tamanna Bhatia, Taman-TeluguStop.com

ఇక కేవలం సినిమాలతోనే, అందంతోనే కాదు ఆమె తన లావిష్ లైఫ్ తో కూడా టాలీవుడ్ హీరోయిన్స్ కి సవాల్ విసురుతుంది.ఇక తమన్నా దగ్గర ఉన్న ఐదు అతి ఖరీదైన వస్తువులేంటో ఈ ఆర్టికల్లో చూసేద్దాం పదండి.

మొదటగా తమన్నా ఖరీదైన వస్తువుల కలెక్షన్స్ లో చెప్పుకోవాల్సింది బ్యాగ్స్ గురించి.తమన్నాకు బ్యాగ్స్ అంటే మహా ఇష్టమట అందుకే తన దగ్గర మంచి కాస్ట్లీ బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఉంది.

దాంట్లో చెప్పుకోదగ్గ ఖరీదైన బ్యాగ్ chanel బ్యాగ్ దీని ఖరీదు ఏకంగా మూడున్నర లక్షలకు పైగానే ఉంటుందట ఈ బ్యాగ్ తో అమ్మడు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం.

మరో ఖరీదైన వస్తువు ఆమె వేసుకున్న మార్కేస్ గౌన్ గురించి.

దీని ఖరీదు ఏకంగా నాలుగు లక్షల 41 వేల రూపాయలు.

Telugu Tamanna, Tamanna Diamond, Tamanna Luxury-Movie

సాధారణంగా సెలబ్రిటీలు నాలుగైదు లక్షల పెట్టి బట్టలు కొనడం పెద్ద విషయమేమీ కాదు గాని, తమన్నా మాత్రం మామూలుగా చాలా తక్కువ చాలా తక్కువ డబ్బులే బట్టల పైన వెచ్చిస్తుందట.కానీ ఏకంగా దాదాపు 5 లక్షల విలువ చేసే మార్కేస్ గౌన్ తో ఒక్కసారిగా సంచలనంగా మారింది తమన్న వ్యవహారం.

Telugu Tamanna, Tamanna Diamond, Tamanna Luxury-Movie

ఇక తమన్నా సొంత చేసుకున్న మరో ఖరీదైన మరో వస్తువు రాండ్ రోవర్ కారు, దీని ఖరీదు 69.99 లక్షలు దాదాపు 70 లక్షల ఖరీదైన ఈ కారు తమన్న తన గ్యారేజీ లో పెట్టుకుంది.ఇదే కాక మరికొన్ని కార్లు కూడా తమన్నా దగ్గర ఉన్నాయ్.

ఇక తమన్నా జువెలరీకి చాలా విలువిస్తుందనే విషయం ఇటీవల బయటపడింది.ఆమె దగ్గర ఏకంగా రెండు కోట్ల విలువ చేసే ఒక డైమండ్ రింగ్ ఉందట దీని ఖరీదు తెలిసి టాలీవుడ్ డే కాదు ఏకంగా బాలీవుడ్ సైతం నోరెళ్ళ పెడుతోంది.

Telugu Tamanna, Tamanna Diamond, Tamanna Luxury-Movie

ఇక చివరగా తమన్నా తీసుకున్న మరొక అత్యంత ఖరీదైన నిర్ణయం ముంబైలో అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకోవడం ముంబై అపార్ట్మెంట్లో 16 కోట్ల 60 లక్షల రూపాయలు పెట్టి అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ ని తమన్నా తన సొంతం చేసుకుంది.చూసారుకదా ఇవే తమన్నా దగ్గర ఉన్న అత్యంత ఐదు ఖరీదైన వస్తువులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube