పోలీస్ ఆఫీసర్ గా ఒకప్పటి స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.

 Introducing Venu Thottempudi As Ci Murali In Slv Cinema , Venu Thottempudi, Ravi-TeluguStop.com

హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.అలాగే రెమ్యునరేషన్ పెంచినా కూడా ఈయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

ప్రెసెంట్ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ‘ చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.ఈ సినిమాను జులై 17న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.

కానీ ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు మేకర్స్.

ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అవ్వడం వల్ల మరోసారి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్న విషయం విదితమే.

అయితే తాజాగా ఈయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.

Telugu Venuthottempudi, Rajisha Vijayan, Ramarao Duty, Ravi Teja, Sharat Mandava

ఇందులో వేణు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.సిఐ మురళి గా నటిస్తున్న ఈయన ఫస్ట్ లుక్ రివీల్ చేసారు.ఈ గెటప్ లో వేణు పవర్ ఫుల్ అండ్ చార్మింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

దీంతో ఎంట్రీ నే పవర్ ఫుల్ రోల్ లో వస్తుండడంతో వేణు పాత్రపై సాలిడ్ బజ్ ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube