స్టైలిష్ అండ్ ఛార్మింగ్ మహేష్ తో భార్యామణి నమ్రత.. పిక్ అదిరింది!

సూపర్ స్టార్ మహేష్ బాబు 46 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ అండ్ యంగ్ చార్మింగ్ లుక్ తో అమ్మాయిలను ఫ్లాట్ చేయడంలో ముందు వరుసలో ఉన్నాడు.అంతలా తన కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో ఈయన మెస్మరైజ్ చేస్తున్నాడు.

 Stylish Mahesh And Namrata Pair At New York Streets, Mahesh Babu, Trivikram, Ssm-TeluguStop.com

ఇటీవలే మహేష్ నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుని సూపర్ హిట్ టాక్ తో వసూళ్ల పరంగా కూడా దుమ్ము లేపింది.

ఈ సినిమా ప్రెసెంట్ ఓటిటి లో కూడా అదే రేంజ్ లో సందడి చేస్తుంది.ఇక మహేష్ బాబు సర్కారు సక్సెస్ తర్వాత అమెరికాకు ఫ్యామిలీతో కలిసి వెళ్లి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తున్నాడు.తాజాగా మహేష్ భార్య నమ్రత శిరోత్కర్ షేర్ చేసిన ఫొటో అందరిని ఆకట్టు కోవడమే కాకుండా అందరిని స్టన్ అయ్యేలా చేస్తుంది.

మహేష్ తన కుటుంబంతో హ్యాపీ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి ఫ్యాన్స్ అందరికి తెలుసు.దీంతో ఈయన నుండి ఎప్పటికప్పుడు ఫొటోస్ వస్తూనే ఉన్నాయి.

అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.తాజాగా మరొక హ్యాపీ మూమెంట్ ను నమ్రత షేర్ చేసింది.

మహేష్ బాబుతో కలిసి న్యూయార్క్ నగర వీధుల్లో ఎంజాయ్ చేస్తుంది.

ఆ సందర్భంగా దిగిన ఫోటోను షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఫొటోలో ఇద్దరు కూడా మంచి స్టైలిష్ గా ఉన్నారు.సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఈ ఫోటో బాగా ఆకట్టుకుంది.

మహేష్ బాబు సర్కారు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా జులై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం అందుతుంది.

ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube