అక్కడి హోటల్‌లో ఒక్కరాత్రి ఫ్రీగా పడుకోవచ్చు.. అయితే మొత్తం తంతుని షో చేయాల్సి ఉంటుంది?

మనదగ్గర పండగలు, పబ్బాలు, మేరేజ్ ఫంక్షన్స్, బర్త్ డే సెలిబ్రేషన్స్ అని ఏడాది పొడవునా నెలకు ఒకసారైనా మనం ప్రయాణించవలసి ఉంటుంది.ఈ క్రమంలో మన సౌకర్యం కోసమైనా ఏదన్నా హోటల్ ని సందర్శించడం, అందులో ఓ రూమ్ తీసుకోవడం ఇపుడు పరిపాటిగా మారింది.

 You Can Stay In The Hotel There For Free For One Night But You Have To Show The-TeluguStop.com

ఇక మనిషి అవసరానికి తగ్గట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు హోటల్స్, షాపింగ్ మాల్స్ రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.దీంతో జనాలు కూడా ఆ ఆఫర్లను చూసి పరుగులు తీస్తుంటారు.

తీరా అక్కడికెళ్లాక.కండిషన్స్ అప్లయ్! బోర్డు చూసి ఒకింత నిరాశపడటం సాధారణ విషయం.

ఇపుడు తాజాగా స్పానిష్ ఐల్యాండ్‌లోని ఒక హోటల్‌ కూడా ఇలాంటి ఆఫరే ప్రకటించింది.ఈ ఆఫర్లో భాగంగా అక్కడకు వచ్చే అతిథులకు రాత్రిపూట ఉచితంగా బస చేసే అవకాశం కల్పించింది.

కానీ ఇందుకోసం పెట్టిన కండిషన్ మాత్రం చూస్తే ఆ ఆఫర్ ని వాడుకోవడానికి ధైర్యం చేయాల్సి ఉంటుందని అర్ధం అవుతుంది.విషయంలోకి వెళితే, పారడిసో ఆర్ట్ హోటల్‌లోని ‘జీరో సూట్’ గదికి గ్లాస్ తో కూడిన గోడలు ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా ఆ రూమ్ హోటల్ లాబీలో ఉంటుంది.అంటే హోటల్‌కు విచ్చేసే ప్రతి ఒక్కరు అక్కడ బస చేసిన అతిథుల యాక్టివిటీని మొత్తం చూడగలరు.

అయితే ప్రస్తుతం ఈ ‘జీరో సూట్‘లోనే ఉచిత బస అందిస్తుండగా.ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

అయితే ఈ ఆఫర్ ని వినియోగించుకున్న కస్టమర్లు కూడా ఉండటం కొసమెరుపు.తాజాగా ఈ జీరో సూట్ గదిలో గడిపిన టిక్‌టాకర్ ఒలింపియా అన్లే.

తన అనుభవాన్ని వీడియో రూపంలో షేర్ చేసింది.ఆమె మాట్లాడుతూ.“గది గోడలు గ్లాస్‌తో ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నప్పటికీ బాత్ రూమ్ వాల్స్ మాత్రం అపారదర్శకంగానే వున్నాయి.ఇక్కడ అనుభవం గురించి సింగల్ లైన్లో చెప్పాలంటే, ఒంటి మీద బట్టలు లేకుండా పబ్లిక్‌లోకి వెళ్లిన ఫీలింగ్ కలిగింది.” అని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube