విత్తనాలను దాచే బ్యాంక్.. బంగారం కంటే పటిష్ట భద్రత!

బేసిగ్గా మనుషులు డబ్బుని బ్యాంకులలో దాచుకుంటారు.అలాగే బంగారాన్ని కూడా లాకర్లలో భద్రపరుస్తారు.

 Interesting Facts About Svalbard Seed Vault Bank Norway Details, Save, Viral Lat-TeluguStop.com

ఇదే మాదిరి విత్తనాలను కూడా దాచే బ్యాంకులు వుంటాయని ఇక్కడ ఎంతమందికి తెలుసు? ఈ భూమిపై జీవకోటి జీవించడానికి ఆహారం అనేది ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పనిలేదు.ఆహారం లేకపోతే మానవుడితో పాటు ఇతర జీవరాశి కూడా మనుగడ సాధించలేవు.

ఆదిమ మానవులు జంతువుల మాంసాన్ని, అలాగే అడవులలో దొరికే చెట్ల పళ్లను తింటూ జీవించేవారు.ఆ తర్వాత నాగరికత నేర్చుకున్న తర్వాత పంటలు పండించడాన్ని మానవుడు అలవరుచుకున్నాడు.

మనం ఇప్పుడు తీసుకునే ఆహారం 90% మొక్కలనుండే వస్తుందనే విషయం తెలిసినదే.

అయితే ఒకవేళ, ఏదైనా విపత్తు జరిగి పంటలు పూర్తిగా అంతరించినా, అలాగే మళ్లీ పంటలు వేసేందుకు ఆ రకమైన విత్తనాలు లభించకపోతే.

అప్పుడు మానవుడు సదరు పంటలను పండించలేడు.తత్ఫలితంగా ప్రపంచంలో ఆహార సంక్షోభం ఏర్పడటం ఖాయం.

అందుకే ఇటువంటి పరిస్థితిని నివారించడానికి 2008 ఫిబ్రవరిలో నార్వే ప్రభుత్వం తమ దేశంలోని స్పీట్స్ బర్గ్ లో “స్వాల్ బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్”ను ఏర్పాటు చేసింది.దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రపంచంలోని విత్తనాలను భద్రపరచడమే.

బ్యాంక్ లు మన డబ్బును బంగారాన్ని ఎలాగైతే భద్రపరుస్తాయో.ఈ గ్లోబల్ సీడ్ వాల్ట్ విత్తనాలను భద్రపరుస్తుందన్నమాట.

Telugu Crops, Dooms Day Bank, Norway, Save, Seed Bank, Seed Vault Bank, Svalbard

దీనిని నార్త్ పోల్ నుంచి 482 కిలోమీటర్ల దూరంలో స్పిట్స్ బర్గ్ లో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ బ్యాంక్ పర్వతం లోపల 150 మీటర్ల కింద ఉంటుంది.2021 నాటికి ఈ సీడ్ బ్యాంక్ లో దాదాపు 10 లక్షలకు పైగా పంటలకు సంబంధించిన విత్తనాలు ఉన్నాయని సమాచారం.వీటిని -18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు.

ఎంతటి ప్రమాదం జరిగినా ఈ బ్యాంక్ కు ఏం కాకుండా దీనిని నిర్మించడం జరిగింది.దీని బాధ్యతలను నార్వే ప్రభుత్వం చూసుకుంటుంది.

ఏదైనా దేశంలో ఒక పంట అంతరించిపోయినా.దానికి సంబంధించిన విత్తనాలు ఈ బ్యాంక్ లో లభిస్తాయి.

వీటి ద్వారా మళ్లీ ఆ పంటను పండించేందుకు విలవుతుందన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube