అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దారుణం...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన అమెరికా ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని చెప్పాలి.

 6 Killed In Mass Shooting At Us Independence Day Parade,us Independence Day,july-TeluguStop.com

అమెరికాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కట్టుదిట్టమైన భద్రతా ఉన్న ప్రాంతంలో సైతం ఓ దుండగుడు కాల్పులు జరపడం అమెరికా ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని చెప్పాలి.దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులలో సుమారు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని షికాగో గల ఇలినాయిలో అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకలలో భాగంగా పెరేడ్ నిర్వహిస్తున్న సమయంలో దగ్గరలోని ఓ స్టోర్ నుంచీ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరపడంతో వేడుకలలో పాల్గొన్న వారు పెద్దగా అరుస్తూ పరుగులు పెట్టారు.ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా సుమారు 20 మందికి పైగా గాయాలయ్యాయి.

వేడుకలు మొదలైన 10 నిమిషాల వ్యవధిలోనే ఈ కాల్పులు జరగడంతో వేడుకలను నిలిపివేశారు.

Telugu Chicago, Gun, Joe Biden, July, Mass, Republican-Telugu NRI

ఈ ప్రాంతం మీదుగా ఎలాంటి వాహనాలు రాకుండా భద్రతా చర్యలు చేపట్టారు.దుండగుడు దగ్గరలోని స్టోర్ పై నుంచీ కాల్పులు జరిపినట్టుగా గుర్తించిన పోలీసులు అక్కడి సిసి టీవీ పుటేజ్ లు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.పక్కా ప్లాన్ ప్రకారమే దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని గన్ ఫైర్ చేయడం కోసం అతడు అధునాతన తుపాకీని వాడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా గన్ కల్చర్ పై నియంత్రణ తీసుకువచ్చేందుకు బిడెన్ కొత్త చట్టంపై సంతకం చేసిన కొన్ని రోజులలోనే ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగించింది.ఇదిలాఉంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కట్టుదిట్టమైన భద్రతా ఉన్నా సరే ఇలాంటి ఘటనలు జరగడం అమెరికా ప్రభుత్వ అలసత్వానికి నిదర్సనమంటూ రిపబ్లికన్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube