'ది వారియర్'పై పెరుగుతున్న అంచనాలు.. మరి రామ్ సఫలం అవుతాడా?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు.ఈయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేరు.

 Ram Pothineni Krithi Shetty's 'the Warrior' Huge Expectations, Ram Pothineni , T-TeluguStop.com

ఇంతకు ముందు అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండేవాడు.కానీ ఇప్ప్పుడు ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఆయన తన లుక్ ని పూర్తిగా మార్చి చాకొలేట్ బాయ్ కాస్త యాక్షన్ హీరోగా మారిపోయి మాస్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.

ఈ సినిమా ఇచ్చిన జోష్ తో రామ్ మరిన్ని మాస్ అండ్ యాక్షన్ సినిమాలనే ఎంచుకుంటూ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యి మాస్ హీరో అనిపించు కోవడానికి బాగా ట్రై చేస్తున్నాడు.ఇందులో భాగంగానే రామ్ రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.

రామ్ కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.

ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.

రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తూ ఉండగా.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేసారు.

Telugu Adi Pinchetti, Krithi Shetty, Linguswamy, Ram Pothineni, Warrior-Movie

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ ఆకట్టు కోవడమే కాకుండా అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసాయి.ఇక గత రెండు రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దీంతో ఈ సినిమాపై తెలుగు, తమిళ్ భాషల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

మరి రామ్ వీరి అంచనాలను రీచ్ అవుతాడో లేదో చూడాలి.ఇక పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube