అమీర్ ఖాన్ పీకే, రౌడీస్టార్‌ లైగర్‌.. సక్సెస్ సెంటిమెంట్‌

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది.డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ ఈ సినిమా ను తెరకెక్కించాడు.

 Vijay Devarakonda Movie Liger And Ameer Khan Movie Pk Posters Same , Ameer Khan,-TeluguStop.com

ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్‌ పోస్టర్ విడుదల అయ్యింది.ఈ పోస్టర్‌ ను చూసిన వెంటనే నాకు మాత్రం అమీర్ ఖాన్‌ నటించిన పీకే సినిమా గుర్తుకు వచ్చింది.

చిన్న హీరోలు న్యూడ్ గా కనిపించడం అప్పుడప్పుడు జరుగుతుంది.కాని స్టార్‌ డమ్‌ ఉన్న హీరోలు అలా కనిపించడం అంటే మామూలు విషయం కాదు.

పీకే సినిమా కోసం అమీర్‌ ఖాన్‌ అలా కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు.అమీర్‌ ఖాన్ ఆ సినిమా పోస్టర్ లో ఒక రేడియోను అడ్డం పెట్టుకుంటే ఈ పోస్టర్ లో విజయ్‌ దేవరకొండ మాత్రం ఒక ప్లవర్ బోకే ను అడ్డం గా ఉంచాడు.

ఈ సన్నివేశంకు ఆ సన్నివేశంకు ఏమాత్రం సంబంధం ఉండి ఉండదు.కాని ఖచ్చితంగా సెంటిమెంట్ తో సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ యొక్క పోస్టర్‌ ను అభిమానులు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు.ఇలాంటి పోస్టర్‌ తో విజయ్ దేవరకొండను ఏం చేయబోతున్నావు పూర్తి అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమా కు పాజిటివ్ బజ్ దక్కినందుకు సంతోషం గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆగస్టు లో విడుదల కాబోతున్న లైగర్‌ సినిమా కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా పూర్తి అయ్యింది.త్వరలోనే సినిమా ప్రమోషన్ ను మొదలు పెట్టబోతున్నారు.

పాన్‌ ఇండియా స్థాయి లో సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube