కుందేలును అనుకరించిన కుక్కపిల్ల.. వీడియో వైరల్..!

కుక్కలు చాలా స్మార్ట్ అని చెప్పవచ్చు.ఇవి మనుషుల మాట్లాడగలిగే మాటలను అర్థం చేసుకొని ఆ మాటలకు అనుగుణంగా ప్రవర్తించగలవు.

 A Puppy Imitating A Rabbit Video Viral Dog, Rabbit, Viral Latest, News Viral, So-TeluguStop.com

మొన్నీ మధ్య రిలీజ్ అయిన 777 ఛార్లీలో ఒక లాబ్రడార్ కుక్క ఎన్నో హావభావాలను వ్యక్తీకరించి ఆశ్చర్యపరిచింది.ట్రైనింగ్ ఇచ్చారులే కానీ ఒక కుక్క అయి ఉండి ఎన్నో రకాల బాడీ ఎక్స్‌ప్రెషన్స్ తో అందరికీ కంటతడి పెట్టించడం నిజంగా ఆశ్చర్యకరమే.

అయితే కుక్కలకు మనుషులు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.ఇవి స్వతహాగా యాక్టింగ్ చేయగలవు.

ఇటీవల ఒక కుక్క కోడిని ఇమిటేట్ చేసి ఆశ్చర్యపరిచింది.అయితే తాజాగా మరొక కుక్క పిల్ల ఒక కుందేలుని ఇమిటేట్ చేసి అందర్నీ ఫిదా చేస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఇంటి ప్రాంగణంలో ఒక నల్ల కుక్క పిల్ల, నల్ల కుందేలు పిల్ల ఉండటం మీరు గమనించవచ్చు.

నల్ల కుక్క పిల్ల కుందేలతో సరదాగా ఆడుకోవడం కూడా గమనించవచ్చు.ఆ కుక్కపిల్ల కుందేలు వెనుక భాగాన్ని తన ముందు కాళ్లతోటి టచ్ చేయగానే కుందేలు ఒక్కసారిగా ఎగురుతూ ముందుకు వెళ్ళింది.

ఆ కుందేలు ఎగిరినట్టు ఈ కుక్క పిల్ల కూడా ఎంతో ముందుకు వెళ్ళింది.అలా కుందేలు జంప్స్‌ను ఈ కుక్క భలే చక్కగా ఇమిటేట్ చేసింది.ఈ ఫన్నీ దృశ్యాలను యజమాని వీడియో రికార్డ్ చేశారు.ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది.

ఇది చూసిన నెటిజనులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.గతంలో ఒక పిల్లి కూడా కుందేలు లాగ గెంతుతూ ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు కుక్క కూడా అలాగే చేసి యానిమల్ లవర్స్‌ను ఫిదా చేస్తోంది.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube