ICC Cricket: ICC బోర్డ్ మీటింగ్.. నో చెబుతున్న పాకిస్థాన్!

ICC (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) బోర్డు సభ్యుల సమావేశం ఈనెల అనగా జులై 25, 26 తేదీలలో బర్మింగ్‌హామ్‌లో జరగనుందని సమాచారం.ఈ సమావేశంలో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో జరగబోయే పరిణామాలపై కూలంకశంగా చర్చించనున్నారు.ఈ సమావేశం కామన్వెల్త్ క్రీడల సందర్భంగా జరుగుతుందని భోగట్టా.2024-31 సీజన్ కోసం ICC FTP (ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్) గురించి కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారు.ఇంకో ముఖ్యవిషయం ఏమంటే, ఇక్కడ ICC చైర్మన్ ఎన్నికపై కూడా చర్చ జరగనుంది.

 Icc Cricket Icc Board Meeting Pakistan Saying No-TeluguStop.com

ఎందుకంటే, ICC చైర్మన్ పదవీకాలం ఈ ఏడాదితో ముగుస్తుంది.

కాబట్టి ఈ విషయమై ఓ క్లారిటీ రాబోతుందని ఆశిద్దాం.ఇక త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

దీనితో పాటు, BCCI (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) కూడా IPL విండోకు సంబంధించి అన్ని విదేశీ బోర్డులతో చర్చలు జరుపుతుందని కూడా భావిస్తున్నారు.వచ్చే FTP నుంచి IPLకు రెండున్నర నెలల సమయం ఉంటుందని BCCI కార్యదర్శి జైషా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విదితమే.

Telugu Board, Latest, Pakistan, Ups, India-Latest News - Telugu

ICC తదుపరి FTPకి IPLకు రెండున్నర నెలల సమయం ఉంటుందని జైషా గత నెలలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి అందరికీ తెలిసినదే.2027లో IPLలో 94 మ్యాచ్‌లు ఆడనున్నామంటూ షా ప్రకటించాడు.IPL తదుపరి ICC FTP క్యాలెండర్ నుంచి రెండున్నర నెలల అధికారిక విండోను కలిగి ఉంటుందని, తద్వారా అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్లందరూ ఇందులో పాల్గొనవచ్చని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube