ఘనంగా పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం

స్థానిక నరసరావుపేట పట్టణంలోని A1 కన్వెషన్ హాల్లో పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం ఘనంగా జరిగింది.కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ కొడాలి నాని జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు కారుమూరి వెంకట నాగేశ్వర రావు , పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు , మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు , శ్రీమతి విడదల రజిని ,వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు , గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి , శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి , డొక్కా మాణిక్య వరప్రసాద్ , ప్లీనరీ సమావేశాల పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ మందపాటి శేషగిరి రావు గారు, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం , వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

 Mla Gopireddy Srinivas Reddy Slams Tdp,gadapa Gadapa Proggram,palnadu,ycp,tdp,am-TeluguStop.com

ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ….

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా కూడా ఇవాళ ప్రతి ఎమ్మెల్యే గడప గడపకు వెళ్తున్నాం అని. గడప గడపకు సంక్షేమం, గడప గడపలో సంతోషం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ కలిసి పని చేస్తే 151 సీట్లతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.సచ్చినా.బతికినా వైసిపిలోనే ఉంటాం.జగన్ గారిని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని తేల్చి చెప్పారు.

గడప గడప దెబ్బకి టిడిపి గ్రాఫ్ మరింత పడిపోయింది అని విమర్శించారు.నేడు తెలుగుదేశం లో ఉన్న పెదాలు కూడా టిడిపికి ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.

కార్యకర్తలు లేనిదే పార్ట్ లేదని.రానున్న రోజుల్లో కార్యకర్తలు సంతోషంగా ఉండటానికి జగన్ గారు ప్రణాళిక చేశారు అని వివరించారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube