స్టార్ మాలో మళ్ళీ రీ ఎంట్రీ.. ఆ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన వంటలక్క!

స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికి తెలిసిందే.ఎందుకంటే ఆ సీరియల్ గత కొంత కాలం నుండి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Star Ma Re Entry Again Vantalakka Gave Clarity With That Post , Star Maa, Vantal-TeluguStop.com

ఇక ఆ సీరియల్ లో నటించిన వంటలక్క పాత్ర గురించి అందరికీ తెలిసిందే.ఆ సీరియల్ లో దీపను ప్రేక్షకులు ముద్దుగా వంటలక్క అని పిలుచుకుంటారు.

అంతేకాకుండా స్టార్ మాలో ఈ సీరియల్ కు ఉన్న రేటింగ్ అంతా ఇంతా కాదు.ఇక వంటలక్క అంటే తెలుగు ప్రేక్షకులకు మంచి అభిమానం ఉన్న నటి.ఇక వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.తను కేరళకు చెందిన మలయాళ నటి.కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతే కాకుండా ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకుంది.

ఇక ఈ సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.ఇప్పుడు ఆ సీరియల్ లో తన పాత్ర ముగియటంతో ఆమె అభిమానులు చాలా బాధపడ్డారు కూడా.

ఇక ఈమె మళ్లీ రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుంది అని ఇప్పటికి ఎదురుచూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.

Telugu Maa, Telugu, Tollywood, Vantalakka-Movie

సీరియల్ కు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటుంది.వంటలక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తెగ ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనను షూట్ చేసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

అంతేకాకుండా ప్రేమి విశ్వనాథ్ కు మలయాళం లో కూడా అభిమానులు ఎక్కువగా ఉన్నారు.

సీరియల్ లో ఉండే వంటలక్క గెటప్ పక్కనపెడితే బయట ఉండే వంటలక్క గెటప్ ను చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే.జీన్స్, టాప్స్ వేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

ఇక ప్రస్తుతం ఈమె వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.

ఓ వైపు కార్తీకదీపం సీరియల్ కు దూరంగా ఉన్నా కూడా మరోవైపు తెగ అవకాశాలు అందుకుంటోంది.

ఇప్పటికే తన సోషల్ మీడియా వేదికగా తను అందుకున్న ప్రాజెక్టుల గురించి అప్డేట్ కూడా ఇచ్చింది.అప్పుడప్పుడు స్టార్ మా లో నిర్వహించే ఈవెంట్లలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.

Telugu Maa, Telugu, Tollywood, Vantalakka-Movie

ఇక ఇదంతా పక్కన పెడితే త్వరలో వంటలక్క మళ్ళీ స్టార్ మా లో అడుగు పెట్టనున్నట్టు తెలుస్తుంది.అదేంటంటే ఫ్యాన్ పేజ్ పంచుకున్న ఫోటోను తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.అందులో తాను ఊర మాస్ లుక్ లో ఉండగా.త్వరలో స్టార్ మా కు ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తుంది.

ఇక ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు తెగ లైకులు కొట్టడంతో పాటు కామెంట్లు పెడుతున్నారు.ఈసారి వంటలక్కగా కాకుండా ఊర మాస్ లుక్ లో మన ముందుకు వస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు తన అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube