గాడ్ ఫాదర్ పై చరణ్ ఆసక్తికర ట్వీట్.. మిస్టర్ బీన్ లా ఎదురు చూస్తున్నానంటూ..

టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.

 Ram Charan Waiting For July 4th For Godfather Details, Megastar Chiranjeevi, God-TeluguStop.com

దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.దీంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ ప్లాప్ ను వీలైనంత త్వరగా మర్చిపోవాలని మెగాస్టార్, చరణ్ ఇద్దరు కూడా కసిగా కృషి చేస్తున్నారు.

ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ముగింపు దశకు చేరుకోవడంతో వరుస అప్డేట్ లను సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా నుండి మెగాస్టార్ లుక్ ను రివీల్ చేయబోతున్నట్టు ఒక పోస్టర్ వదిలిన విషయం తెలిసిందే.

ఈ ఫస్ట్ లుక్ జులై 4న సాయంత్రం 5.45 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.చరణ్ కూడా ఎదురు చూస్తున్నట్టు తాజాగా ఒక ఆసక్తికర పోస్టర్ ద్వారా తెలిపారు.ఈయన మిస్టర్ బీన్ కు సంబంధించిన ఒక గిఫ్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ నేను కూడా మిస్టర్ బీన్ లాగా ఎదురు చూస్తున్న అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.

ఫన్నీ మిస్టర్ బీన్ గిఫ్ అందరిని ఆకట్టు కుంటుంది.మరి చిరంజీవి ఇందులో ఎలా కనిపిస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ఇక ఇందులో చిరంజీవి కి తోడుగా సల్మాన్ ఖాన్, సునీల్, నయనతార, పూరీ జగన్నాథ్, అనసూయ ఇలా ఇంత మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించ బోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube