పక్కా కమర్షియల్ తర్వాత ప్రభాస్ నిర్ణయం ఏంటీ?

గోపీచంద్‌.రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన పక్కా కమర్షియల్‌ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు సంబంధించిన రివ్యూలు చాలా పాజిటివ్ గా వచ్చాయి.సినిమా కమర్షియల్‌ ఎలిమెంట్స్ కలిగి ఉందని.గోపీచంద్‌ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా నవ్వించి ఎంటర్‌ టైన్ చేసే విధంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కొందరు మాత్రం మరీ నాసిరకం.

 After Pakka Commercial Movie Release What Is Prabhas Raja Deluxe Update  Pakka C-TeluguStop.com

రొటీన్‌ పక్కా కమర్షియల్‌ మూవీ అంటూ రివ్యూలు ఇచ్చారు.మొత్తానికి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పక్కా కమర్షియల్‌ సినిమా వచ్చేసింది.

ఈ సినిమా ఫలితాన్ని బట్టి ప్రభాస్ నిర్ణయం తీసుకుంటాడని అంతా ఎదురు చూస్తున్నారు.పక్కా కమర్షియల్‌ బిగ్గెస్ట్‌ కమర్షియల్ హిట్‌ గా నిలిచి ఉంటే ఖచ్చితంగా ప్రభాస్ ఏమాత్రం ఆలోచించకుండా ఇప్పటికే సినిమా ను అధికారికంగా మారుతి తో చెప్పించే వాడు.

కాని సినిమా కు కాస్త అటు ఇటు టాక్ వచ్చింది.

ఇప్పుడు ప్రభాస్ ఏం అంటాడు అనేది చూడాలి.

మొదట రాజా డీలక్స్ యొక్క ఫైనల్‌ వర్షన్ స్క్రిప్ట్‌ ను మారుతి రెడీ చేయాల్సి ఉంది.ఆ స్క్రిప్ట్‌ విషయంలో ప్రభాస్ తో పాటు ఆయన సన్నిహితులు మరియు నిర్మాత కూడా సంతృప్తి చెందాలి.

అప్పుడు సినిమా ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.ఒక వేళ స్క్రిప్ట్‌ విషయంలో కాస్త అటు ఇటు అయినా కూడా పక్కా కమర్షియల్‌ అసలే నిరాశ పర్చింది.

ఇప్పుడు ఈ స్క్రిప్ట్‌ తో మనం వెళ్లడం కరెక్ట్‌ కాదు అంటూ మెల్లగా రాజా డీలక్స్ నుండి సైడ్‌ అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మారుతికి లైఫ్ అండ్‌ డెత్‌ అనుకున్న పక్కా కమర్షియల్‌ సినిమా ఫలితం అటు ఇటు కాకుండా అయ్యింది.

ప్రభాస్ తో సినిమా చేసి హిట్‌ కొడితే చిరంజీవి పిలిచి మరీ డేట్లు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube