ఎన్నో ఏళ్ల నుంచి హీరోయిన్గా ప్రేక్షకులను అలరిస్తూ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మీనా ఇంట్లో ఇటీవలే అనుకోని విషాదకర ఘటన చోటుచేసుకుంది అన్న విషయం తెలిసిందే.మీనా భర్త విద్యాసాగర్ హఠాత్ మరణం చెందారు.
లంగ్స్ ఫెయిల్ అవ్వడం కారణంగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.దీంతో ఇక మీనా అభిమానులు అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే.
అయితే విద్యాసాగర్ హఠాత్ మరణం చెందడానికి గల కారణాలు ఏంటి అన్న విషయంపై గత కొన్ని రోజుల నుంచి ఎన్నో వార్తలు త్వరగా మారిపోతున్నాయ్.
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ప్రముఖ తమిళ నటి కుట్టి పద్మిని షాకింగ్ విషయాలను చెప్పింది.
బాల నటిగా కెరీర్ మొదలుపెట్టి.ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ అభిమానులను సంపాదించుకుంది కుట్టి పద్మిని.
నిర్మాతగా కూడా ఇప్పుడు ఎంతో మంది ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు అని చెప్పాలి.అయితే కుట్టి పద్మిని అటు హీరోయిన్ మీనా తో ఎంతగానో మంచి అనుబంధముంది.
ఈ క్రమంలోనే ఇటీవల మీనా విద్యా సాగర్ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కుట్టి పద్మిని.కచ్చితంగా అయితే చెప్పలేను గానీ.
గత కొన్ని రోజుల నుంచి మీనాకు అతని భర్త విద్యాసాగర్ కు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి అన్న విషయం తన వరకు వచ్చింది.
కూతురు నైనికా సినిమాల్లో నటిస్తూ ఉండటం గురించి మనస్పర్థలు వచ్చాయని.ఇక అప్పటి నుంచి వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు అన్న విషయం నాకు తెలిసింది.విద్యాసాగర్ బెంగుళూరు లో ఉంటుండగా.
ఇక మీనా తన నివాసంలోనే ఉంటుంది.ఇక ఒంటరిగా ఉంటున్న విద్యాసాగర్ పావురాలతో ఎక్కువ సమయం గడపడం కారణంగా.
చివరికి అతనికి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా హఠాత్మరణం జరిగిందని ఎంతోమంది నాతో చెప్పారు.ఇక ఇప్పుడు భర్త లేకుండా కూతురు బాగోగులు మీనా ఒక్కతే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో మీనా తన కూతురు కోసం నిలబడేలా ధైర్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు కుట్టి పద్మిని.