ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమానే.. గోపీచంద్ చేసి సూపర్ హిట్ కొట్టాడు మీకు తెలుసా?

ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు హీరోలు ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.

 This Gopi Chand Movie Rejected By Prabhas  Gopi Chand, Prabhas, Tollwood, Yagnam-TeluguStop.com

ఇకపోతే తక్కువ సమయంలోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగగా.అటు గోపీచంద్ మాత్రం ఇప్పటికీ సరైన స్టార్ డమ్ సంపాదించడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు.

అయితే ఇక ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎక్కడ కలుసుకున్న కూడా ఎంతో ప్రేమగా పలకరించుకుంటారు.అంతే కాదు ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు వస్తు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు.

అయితే సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరో హీరో చేసి హిట్ కొట్టడం జరుగుతూ ఉంటుంది.అయితే ఇండస్ట్రీలో ప్రాణమిత్రులుగా కొనసాగుతున్న ప్రభాస్ గోపీచంద్ మధ్య కూడా ఇలాంటి సినిమా ఒకటి ఉందట.

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాను గోపీచంద్ చేసి సూపర్ హిట్ అందుకుని మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు.ఆ సినిమా ఏదో కాదు యజ్ఞం.ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు హీరో గోపీచంద్. తొలివలపు సక్సెస్ కాకపోవడంతో ఆరేడు నెలల పాటు ఎలాంటి అవకాశాలు రాలేదు.

అలాంటి సమయంలో ఓ రోజు తేజ ఫోన్ చేసి ఓ సీన్ చెప్పి విలన్ గా చేస్తావా అని అడిగారు.వెంటనే చేస్తానని చెప్పాను ఇక ఆ తర్వాత విలన్ గా మంచి హిట్ లభించింది అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు.

Telugu Gopi Chand, Kalyan Ram, Prabhas, Ravi Kumar, Teja, Tholi Valapu, Tollwood

ఇక యజ్ఞం సినిమా ఆఫర్ కూడా అనుకోకుండా వచ్చిందని ముందుగా ఆ కథ నాకోసం రాసింది కాదు అంటూ గోపిచంద్ తెలిపాడు.ప్రభాస్ కోసం కథ రాసి ఇక ప్రభాస్ కు కథను చెప్పారు.ఇక ప్రభాస్ రిజెక్ట్ చేయడం తో కళ్యాణ్ రామ్ కి కూడా ఆ కథను వినిపించారు.అయితే వారికి సినిమా కథ నచ్చిన అప్పటివరకూ రవికుమార్ మొదటి సినిమా పెద్దగా ఆడకపోవడంతో అతనితో సినిమా అనేసరికి వెనకడుగు వేశారు.

ఇక అప్పుడు ఆ దర్శకుడితో ఎవరో అన్నారట వాళ్ళు వీళ్ళు ఎందుకు గోపితో సినిమా చేయొచ్చు కదా అని.అలా తనకు యజ్ఞం సినిమా అవకాశం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube