ఎన్టీఆర్ తో సినిమా అంటే హీరోయిన్లు ఎగబడి పోయేవారట.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోయింది.ఈ క్రమంలోనే ఒక సినిమాలో నటించిన హీరోయిన్ మరోసారి అదే హీరోతో అస్సలు కనిపించడం లేదు.

 Tollywood Heroines Who Wants To Act With Sr Ntr Details, Senior Ntr, Nandamuri T-TeluguStop.com

కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.ఒక హీరోయిన్ ఒక హీరో పక్కన నటిస్తే ఆ సినిమా సినిమా హిట్ అయిందంటే అదే హీరోయిన్ ని ఎన్నో సినిమాల్లో రిపీట్ చేసే వారు దర్శకనిర్మాతలు.

అందుకే ఒక హీరో ఒక హీరోయిన్ కాంబినేషన్ లో దాదాపు పదికి పైగా సినిమాలు అప్పట్లో వచ్చేవి.ఇలా ఎన్టీఆర్ ఏఎన్నార్ సైతం దాదాపు ఒక్కో హీరోయిన్ తో పదికి పైగా సినిమాల్లో నటించారు.

అయితే అప్పట్లో హీరోయిన్లు ఎక్కువగా ఏఎన్నార్ కంటే ఎన్టీఆర్ తో నటించడానికి ఆసక్తి చూపేవారట.

అందుకే ఇలా సావిత్రి -ఎన్టీఆర్, వాణిశ్రీ -ఎన్టీఆర్ కాంబినేషన్ లు వచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి.

ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి.ఆ తర్వాత కాలంలో వచ్చిన జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లు సైతం ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు.

అయితే అప్పట్లో ఎన్టీఆర్ తో సమానంగానే అటు అక్కినేని నాగేశ్వరరావు కూడా హావా నడిపించారు అన్న విషయం తెలిసిందే.కానీ హీరోయిన్లు మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం వెనక ఒక కారణం ఉందట.

నటసార్వభౌముడుగా గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ అంటే ఇండస్ట్రీలో అమితమైన గౌరవం ఉండేది.

Telugu Jayaprada, Nandamuritaraka, Savithri, Senior Ntr, Sr Ntr, Sridevi, Tollyw

అందుకే తమ సినీ కెరీర్ మొత్తంలో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తే చాలు అని హీరోయిన్లు అనుకునేవారట.అంతేకాకుండా ఎన్టీఆర్తో కలిసి నటిస్తే తొందరగా ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం ఉండేది అని నమ్మే వారట.నిర్మాతలు కూడా ఏ అమ్మాయి ఎన్టీఆర్తో నటించడం అంటే మాటలు అనుకున్నావా అంటూ చెప్పే డైలాగులు హీరోయిన్ లలో ఎన్టీఆర్ తో నటించాలని ఆశ ను మరింత రేకెత్తించాయట.

ఈ క్రమంలోనే అప్పట్లో హీరోయిన్లు ఇక ఎన్టీఆర్ తో నటించేందుకు ఎంతగానో ఆశ పడేవారు.ఎన్టీఆర్ సినిమా ఆఫర్ వచ్చింది అంటే చాలు అస్సలు రిజెక్ట్ చేసే వారు కాదట.

అవును మరి అప్పటిలో ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఒక్కడు కాదు ఇండస్ట్రీకే ఒకే ఒక్కడు అన్న విధంగా ప్రస్థానాన్ని కొనసాగించారు.కాబట్టి ఈ మాత్రం క్రేజ్ ఉండడం సహజం అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube