గోపీచంద్ కూడా లవ్ లో ఫెయిల్ అయ్యాడా.. సున్నితంగా రిజెక్ట్ చేసిన యువతీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్ మొదట్లో విలన్ గా పరిచయమైన గోపీచంద్ అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు.

 Gopichand Also Fail In Love A Young Woman Was Gently Rejected Him , Gopichand ,-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం ఈయన పక్కా కమర్షియల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్న గోపీచంద్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటు సినిమా గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక గోపీచంద్ తండ్రి కూడా పెద్ద దర్శకుడు అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోని 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో మనుషులు ఎలాంటివారో అర్థమైందని అప్పుడే నేను మరింత స్ట్రాంగ్ అయ్యానని గోపీచంద్ తెలిపారు.

ఇక తాను బీటెక్ పూర్తి చేయగానేఇండస్ట్రీ వైపు అడుగులు వేశానని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గోపీచంద్ తన లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా బయట పెట్టారు.

Telugu Gopichand, Love Failure, Love Story, Pakka, Russian Young, Telugu, Tollyw

తాను కాలేజీ చదువుతున్న రోజులలోనే ఒక రష్యన్ యువతి ఎంతో నచ్చిందని,ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను.ఈ క్రమంలోనే నా మనసులో ఉన్న మాటను ఆ అమ్మాయికి వెళ్లి చెప్పగా ఆ అమ్మాయి ఎంతో సున్నితంగా తిరస్కరించింది.నేను చెప్పిన విషయం మొత్తం విన్న ఆ అమ్మాయి మీ దేశం వేరు మా దేశం వేరు మన ఇద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరనీ తనని రిజెక్ట్ చేసినట్లు గోపీచంద్ వెల్లడించారు.ఈ ఘటన దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube