పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్..!

గోపీచంద్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్.గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.

 Gopichand Pakka Commercial Business Details ,  Bunny Vasu ,  Geetha Arts , Gopic-TeluguStop.com

జూలై 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తుంది.వరుస ఫ్లాపులతో గోపీచంద్ మార్కెట్ డల్ అయినా కూడా డైరక్టర్ మారుతి కెరియర్ గ్రాఫ్ వల్ల పక్కా కమర్షియల్ సినిమాకు మంచి బిజినెస్ వచ్చిందని తెలుస్తుంది.

పక్కా కమర్షియల్ సినిమా వరల్డ్ వైడ్ గా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.సినిమా హిట్ అనిపించుకోవాలంటే 17 కోట్ల పైన రాబట్టాల్సి ఉంటుంది.

ఈ సినిమా కోసం టికెట్ల రేట్లని కూడా భారీగా తగ్గించారు.సాధారణ ప్రేక్షకుడికి సైతం అందుబాటులో ఉండేలా 100 రూపాయల టికెట్ ప్రైజ్ తో పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ అవుతుంది.

మరి బిజినెస్ బాగానే జరుగగా గోపీచంద్ పక్కా కమర్షియల్ టైటిల్ లానే కమర్షియల్ హిట్ కొడుతుందా లేదా అనంది చూడాలి. గోపీచంద్ మాత్రం ఈ సినిమాతో ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నామని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube