ఇంకా స్క్రిప్ట్‌ మొదలవ్వకుండానే వీఎఫ్ఎక్స్ ఎంటి జక్కన్న?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అనగానే గుర్తకు వచ్చేది ఆయన సినిమా ల్లో గ్రాఫిక్స్.ఈగ నుండి ఆయన గ్రాఫిక్స్ ప్రస్థానం మొదలు పెట్టాడు.

 Rajamouli And Mahesh Babu Movie Vfx Work For Hollywood Company , Bollywood , Fi-TeluguStop.com

ఇండియన్‌ సినిమా ఇంతగా గ్రాఫిక్స్ ను వినియోగిస్తుందా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేసే విధంగా ఈగను తెరకెక్కించాడు.ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెట్టే విధంగా జక్కన్న ఈగ ఆ తర్వాత బాహుబలి సినిమా ను తెరకెక్కించాడు.

బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా అద్బుతంగా రూపొందించారు.ముఖ్యంగా బాహుబలి 2 యొక్క గ్రాఫిక్స్ వర్క్ కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు అనడంలో సందేహం లేదు.

హాలీవుడ్‌ సినిమా ల తరహా లో గ్రాఫిక్స్ ను వాడటం లో కేవలం రాజమౌళికి మాత్రమే ఘనత దక్కింది అనడంలో సందేహం లేదు.హీరో లు ఎవరైనా.

హీరోయిన్స్ ఎవరైనా కూడా రాజమౌళి సినిమా అనగానే అవేమీ చూడకుండా కేవలం గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో అంటూ ఎదురు చూసే వారు చాలా మంది ఉంటారు.

అలాంటి పేరు దక్కించుకున్న జక్కన్న ఇటీవల ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమా లో కూడా అద్బుతమైన గ్రాఫికల్ వర్క్ ను చూపించాడు.గ్రాఫిక్స్ వర్క్‌ కోసం ఆయన భారీగా ఖర్చు పెట్టాడు.ఇప్పుడు రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబు తో చేయబోతున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

ఆ సినిమా ల కోసం జక్కన్న గ్రాఫిక్స్ సంస్థ తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాడు.అంతర్జాతీయ స్థాయి లో పలు హాలీవుడ్‌ సినిమా లకు గ్రాఫిక్స్ వర్క్‌ అందించిన ఆ సంస్థ ను ఇప్పుడు రాజమౌళి హైర్‌ చేసుకుని వచ్చే రోజుల్లో తన మహేష్‌ బాబు సినిమా కు గాను గ్రాఫిక్స్ చేయించుకోబోతున్నాడు.

అంతర్జాతీయ స్టాండర్డ్ ఉన్న కంపెనీ తో సినిమా లు చేయడం అంటే ఖచ్చితంగా సినిమా కు ఇంతకు మించి అద్బుతమైన టెక్నికల్‌ వాల్యూస్ ను జోడించినట్లు అయ్యిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube