ఆదిపురుష్ హాలీవుడ్ లో కూడా.. కన్ఫర్మ్ అంటున్న మేకర్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి.ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచాడు.

 Prabhas Adipurush Likely To Be Released In Hollywood , Prabhas, Adipurush Movie,-TeluguStop.com

డార్లింగ్ అసలు ఇలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నాడు అనే సందేహం ఆయన ఫ్యాన్ కు సైతం కలిగింది.దీంతో ఈయన తర్వాత సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

 ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.

రెండేళ్ల క్రితమే ఈ సినిమా ముంబై లో ప్రత్యేకమైన సెట్స్ లో తెరకెక్కించారు.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించ నున్నాడు.ప్రభాస్ ఇందులో వి షేప్ బాడీతో మెస్మరైజ్ చేయనున్నాడని టీమ్ ఇప్పటికే గర్వంగా చెబుతుంది.

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమాలో సీత గా కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.

లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.

ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.ఇది 3డీ వెర్షన్ కావడంతో అభిమానవులంతా సంతోషంగా ఉన్నారు.

ఇది పక్కన పెడితే.తాజాగా ఈ సినిమా విషయంలో ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

హిందీ మీడియా వార్తల ప్రకారం ఈ సినిమా హాలీవుడ్ లో సైతం రిలీజ్ కాబోతున్నట్టు టాక్ వస్తుంది.ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది.

Telugu Adipurush, Hollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan, Sunny

ఇంతకు ముందు కూడా ఈ వార్త వైరల్ అయినా విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు ఈ వార్త కన్ఫర్మ్ అంటూ స్వయంగా ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు కన్ఫర్మ్ చేసినట్టు హిందీ మీడియా కోడై కూస్తుంది.మరి ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube