రెచ్చిపోతున్న భూకబ్జా దారులు..ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా?

స్నేహితుడు అంటే ఏమి అడకుండా అన్ని ఇచ్చేస్తాం.అటువంటి స్నేహితుడు మనల్ని మోసం చేస్తే మనం భరించలేం.

 Exciting Land Grabs Is This Government Negligence  Land Grabs , Government  ,  N-TeluguStop.com

పది మందికి మంచి చెప్పవలసిన వ్యక్తే మోసం చేస్తే ఇంకా ఆ పరిస్ధితి వర్ణించలేం.నలుగురికి న్యాయం చేసే పోజిషన్ లో ఉండి అన్యాయం చేస్తే మనం ఊహించలేం.

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన దాసరి కనకయ్య,నాగమ్మల దంపతులు.అదే గ్రామానికి చెందిన భూపతి సత్తయ్య అనే వ్యక్తికి చెందిన ఐదు ఎకరాల భూమిని 15 సంవత్సరాలుగా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.

ఆ భూమిని సత్తయ్య అవసరానికి అమ్మకానికి పెట్టగా దాసరి కనకయ్య, నాగమ్మ దంపతులు కొనాలని అనుకున్నారు.నకిరేకల్ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ భర్త మురారిశెట్టి కృష్ణమూర్తి తన చిన్ననాటి స్నేహితుడు కావడంతో మద్య వర్తిగా పెట్టుకున్నారు.

సత్తయ్య దగ్గర నుండి కనకయ్య ఐదు ఎకరాల భూమిని కొనాలని అనుకున్నాడు.ఐదు ఎకరాల భూమి రేటు చేసుకుని అడ్వాన్స్ గా కట్టడానికి కొంత నగదుని కనకయ్య కృష్ణమూర్తికి ఇచ్చాడు.

ఈ భూమి కొంత గొడవలలో ఉందని కృష్ణమూర్తికనకయ్యకు చెప్పి సంవత్సర కాలం పాటు తిప్పుకున్నాడు.

అయితే ఇదే అదునుగా తన స్నేహితుని చెప్పకుండా కృష్ణమూర్తి కనకయ్య ఇచ్చిన డబ్బును, తన దగ్గర కొంత డబ్బును చెల్లించి ఆ ఐదు ఎకరాల భూమిని సత్తయ్య దగ్గర నుంచి రిజిస్టేషన్ చేసుకున్నాడు.

ఈవిషయం తెలుసుకున్న దాసరి కనకయ్య,నాగమ్మ దంపతులు ఎంటి ఈ దారుణం అని ప్రశ్నించగా మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరింపులకు పాల్పడ్డాడు.అధికార పార్టీ నేను ఏమైన చేస్తానని అనడంతో కనకయ్య పోలీసులకు ఆశ్రయించిన ఫలితం లేకపోయింది.

Telugu Adluru, Grabs, Nalgonda, Negligence-Political

దాసరి నాగమ్మ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు న్యాయం చేస్తామిని చెప్పి కిందకు దింపారు.మనోవేదనకు గురైనా కనకయ్య క్రిమిసంహరక మందును సేవించి ఆత్మహత్య యత్నం చేశారు.ఆ దంపతులు తమ కొనాలనుకున్న భూమిని తమకి ఇప్పించి ఆ అధికార పార్టీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇలాంటి నాయకులు ఈ మద్య కాలంలో చాలామందిని చూస్తునే ఉంటాం.

అధికార పార్టీ అని ఏమైన చేయెచ్చు అని ధీమాగా ఉంటారు.ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా… లేక అధికారుల బలమో.

అర్ధంకావడం లేదు.ఇది ఇలానే కొనసాగితే ప్రజలకు అధికారుల మీద నమ్మకం పోయే అవకాశాలు లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube