ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ధర్నా

సూర్యాపేట జిల్లా:దేశవ్యాప్త క్యాంపెయిన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేరేడుచర్ల మండల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్, ఎస్.టి.

 United Teachers Federation Dharna-TeluguStop.com

ఎఫ్.ఐ,తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్.అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించి అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం 2020 వలన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు.రాష్ట్రాల హక్కులు పరిమితం చేయబడి కేంద్రం పెత్తనం పెరిగిపోతుందని, మత సామరస్యానికి భంగం కలిగిస్తుందని,కనుక జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోయే విధానాన్ని విరమించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా 2004 తర్వాత నియామకం అయిన వారికి సామాజిక బాధ్యతగా మారిన జాతీయ పెన్షన్ పథకం విధానాన్ని రద్దు చేయాలని కోరారు.

అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక తహశీల్దార్ సరితకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బి.సైదానాయక్,ప్రధాన కార్యదర్శి బి.అక్కయ్య బాబు,ఎన్.నరసింహ,కె.ఎల్లయ్య,వై.కృష్ణయ్య, ఎండి.రషీద్ ఖాన్,బి.

వెంకటనరసయ్య,వి.రమేష్, ఎల్.వి.శేఖర్,వై.జానయ్య,వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube