త్రివిక్రమ్ అతన్ని డామినేట్ చేస్తాడా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ఈమధ్య డైరక్షన్ కాకుండా వేరే దర్శకుల సినిమాలకు రైటర్ గా కూడా చేస్తున్నాడు.త్రివిక్రం కెరియర్ మొదలు పెట్టింది కూడా రైటర్ గానే.

 Vinodaya Seetham Remake Will Trivikram Dominate Samudra Khani , Bheemla Nayak ,-TeluguStop.com

నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి, నువ్వే కావాలి లాంటి సినిమాలకు ఆయన రైటర్ గా చేశారు.నువ్వే నువ్వే సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు.

డైరక్టర్ గా మారిన తర్వాత తన కథలను తానే డైరెక్ట్ చేస్తూ వచ్చారు త్రివిక్రం.అయితే ఇప్పుడు మళ్లీ ఒకప్పటి రైటర్ త్రివిక్రం లా వేరే దర్శకుల సినిమాలకు రైటర్ గా చేస్తున్నాడు.

ముఖ్యంగా రీమేక్ సినిమాలు అది కూడా పవన్ కళ్యాణ్ చేసే రీమేక్ సినిమాలకు త్రివిక్రం రైటర్ గా ఉంటున్నారు.

Telugu Bheemla Nayak, Pawan Kalyan, Samudra Khani, Tollywood, Trivikram-Movie

ఆల్రెడీ భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రం అన్ని తానై నడిపించాడు.ఇక ఇప్పుడు మరో తమిళ సినిమా వినోదయ సీతం సినిమాని కూడా పవన్ రీమేక్ చేస్తున్నాడు.ఈ రీమేక్ ని మాత్రుక దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు.

అయితే త్రివిక్రం ఈ సినిమాకు రైటర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా విషయంలో త్రివిక్రం సముద్రఖనిని డామినేట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.

భీమ్లా నాయక్ సినిమా విషయంలో డైరక్టర్ సాగర్ చంద్రని డామినేట్ చేశాడు త్రివిక్రం.మరి వినోదయ సీతం కి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube