దుల్కర్ సల్మాన్ సీతా రామం టీజర్..!

మహానటితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో హను రాఘవపుడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సీతా రామం.వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వని దత్ ఈ మూవీ నిర్మిస్తున్నారు.

 Dulquer Salman Seetha Ramam Teaser Released, Dulquer Salman, Hanu Raghavapudi, S-TeluguStop.com

సీతా రామం యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.టీజర్ విషయానికి వస్తే కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఓ సైనికుడి ప్రేమ కథ ఇదని తెలుస్తుంది.

టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని చెప్పొచ్చు.దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీతా రామం సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ కూడా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది.సీతా రామం టీజర్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది.

మరి ఈ సినిమాతో అయినా అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపుడి హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.ఈ సినిమాను ఆగష్టు 5న రిలీజ్ ఫిక్స్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube