వర్మ 'కొండా' కి పెట్టింది ఎంత? రాబట్టినది ఎంత?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా ‘కొండా’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండ సురేఖ మరియు ఆమె భర్త కొండా మురళి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా కొండా సినిమాను తెరకెక్కించడం జరిగింది.

 Ram Gopal Varma Konda Movie Budget And Collections , Flim News, Konda Movie, New-TeluguStop.com

కొండా సినిమా విడుదలకు ముందు కాస్త హడావుడి కనిపించింది.వర్మ మార్క్ వివాదాస్పదపు ప్రమోషన్స్ ను ఈ సినిమాకు చేయలేదు.

కాని ఖచ్చితంగా కొండా వర్గీయులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది.ఒక మంచి కథను చూశాం అన్న ఫీల్ కలుగుతుంది అన్నట్లుగా వర్మ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా పై కొండా ఫ్యామిలీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది.కొండా దంపతుల కూతురు స్వయంగా ఈ సినిమా ను నిర్మించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.

కాని సినిమా ఆశించిన స్థాయి లో రాలేదు.అంచనాలు అందుకోవడం లో విఫలం అయ్యింది.

కొండా సినిమా ను చూసిన వారు నీకో దండం.నీ సినిమా కో దండం అన్నట్లుగా వర్మ ను ట్రోల్‌ చేస్తున్నారు.కొండా సురేఖ మరియు మురళి గురించి చూపిస్తాను అని మొత్తం కల్పితం మరియు ఇంకా ఏమో చూపించావు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి సోషల్‌ మీడియాలో వచ్చిన బ్యాడ్‌ ట్రోల్సింగ్‌ వల్ల కొండా సినిమా కు పెద్దగా వసూళ్లు రావడం లేదు.

కొండా వర్గీయుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం కొండా ఫ్యామిలీ దాదాపుగా రెండున్నర నుండి మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగిందట.ఇప్పుడు కనీసం 50 లక్షల వరకు కూడా థియేటర్ల ద్వారా వచ్చే పరిస్థితి లేదు.

ఓటీటీ మరియు ఇతర రైట్స్ ద్వారా కోటి వరకు వచ్చినా మొత్తంగా మాత్రం భారీ నష్టం తప్పదు అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube